Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: క్రికెట్‌లోనే కాదు.. సంపాదనలోనూ ధోనీ, కోహ్లీల మధ్య గట్టి పోటీ.. ఎంత సంపాదిస్తున్నారంటే?

ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు కేవలం గ్రౌండ్‌లోనే పోటాపోటీగా ఆడటం కాదు.. సంపాదనలోనూ అంతే పోటీని కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరూ ఇంచుమించు ఒకే స్థాయిలో సంపాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఏడాదికి రూ. 1,050 కోట్లు, ధోనీ ఏడాదికి రూ. 1,040 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
 

MS Dhoni and Virat Kohli earns almost equally, and at the top in the earning list kms
Author
First Published Jul 9, 2023, 8:19 PM IST

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమకంటే ప్రత్యేకతను నమోదు చేసుకున్నారు. తమదైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. టీమిండియాలో వీరిద్దరూ జట్టుగా ఆడగా.. ఐపీఎల్ ఒక ప్రత్యేక అవసరాన్ని సృష్టించింది. వీరిద్దరూ ప్రత్యర్థులగానూ పోటాపోటీగా ఢీకొట్టుకున్నారు.

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు ఇంకా సేవలు అందిస్తున్నాయి. పిచ్ పై వీరు చెలరేగినట్టే సంపాదనలోనూ అదే రీతిలో పోటీ పడుతున్నట్టు అర్థం అవుతున్నది. నేటి ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. ధోనీ తదుపరి స్థానంలో ఉన్నారు.

స్టాక్ గ్రో అనే నివేదిక ప్రకారం, కోహ్లీ ఆదాయం రూ. 1,050 కోట్లు. ఇందులో బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్టు కింద యేటా ఏడు కోట్లు వస్తుండగా.. ఒక్కో టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందుకుంటున్నారు. దీనికి తోడు ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందున యేటా రూ. 15 కోట్లు స్వీకరిస్తున్నారు.

Also Read: నా దగ్గర కేటీఎం బైక్ ఉంది.. కానీ, నడుపలేను.. ఎందుకంటే?: రాహుల్ గాంధీ

ఇదిలా ఉండగా ధోనీ కూడా ఇంచుమించు ఇంతే సంపాదన ఆర్జిస్తున్నాడు. సుమారు ఒక పదికోట్లు తక్కువగా సంపాదిస్తున్నట్టు తెలిసింది. ధోనీకి ఐపీఎల్‌లో చెన్నై నుంచి రూ. 12 కోట్లు అందుకుంటున్నారు. అలాగే, పలు కంపెనీల్లో పెట్టుబడులు, సోషల్ మీడియా ఫీజులు, బ్రాండ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుదల ద్వారా ఆయన రూ. 1040 కోట్లు సంపాదిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios