సురేష్ రైనాని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ...  సోషల్ మీడియలో ఫోటోలు షేర్ చేసిన మిస్టర్ ఐపీఎల్...

టీమిండియాలోకి వచ్చిన కొత్తలో భారత జట్టుకి మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా విజయాలు అందించాడు సురేష్ రైనా. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయినా, ఐపీఎల్‌లో మాత్రం ఎక్కడా తగ్గకుండా పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చాడు. ఈ కారణంగానే సురేష్ రైనాని ‘మిస్టర్ ఐపీఎల్’ అని పిలుస్తారు... అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన సురేష్ రైనా, ఐపీఎల్ 2022 సీజన్‌కి కూడా కామెంటరీ చెప్పాడు..

ఐపీఎల్‌లో అద్భుత రికార్డులెన్నో క్రియేట్ చేసిన భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ... ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన సురేష్ రైనా, తమిళనాడులోని చెన్నై సమీపంలో గల వేల్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు...

Scroll to load tweet…

‘వేల్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకి, హృదయపూర్తకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది...’ అంటూ గౌరవ డాక్టరేట్ అందుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సురేష్ రైనా...

టీమిండియా తరుపున ఆడిన దానికంటే ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్లలో సురేష్ రైనా ఒకడు. పేలవ ప్రదర్శనతో భారత జట్టులో చోటు కోల్పోయినప్పటికీ, ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు రైనా... 

సురేష్ రైనా ఆడిన ప్రతీ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి చేరింది. సీఎస్‌కే మూడు టైటిల్స్ రావడంలో సురేష్ రైనా పాత్ర చాలా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరంగా ఉన్నాడు సురేష్ రైనా.. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు విండో సీట్ కోసం ఎమ్మెస్ ధోనీతో సురేష్ రైనా గొడవపడ్డాడని ప్రచారం జరిగింది...

ఐపీఎల్‌ ఆరంభానికి ముందు సురేష్ రైనా మామగారి ఇంటిపై దాడి చేసిన దోపిడి దొంగలు, ఇద్దరిని పొడిచి చంపేశారు. ఈ విషాద సంఘటన తర్వాత యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు సురేష్ రైనా. ఆ సీజన్‌లో వరుస ఓటములతో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్...

చెన్నై సూపర్ కింగ్స్‌కి 5 వేలకు పైగా పరుగులు చేసిన సురేష్ రైనాని, ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆ జట్టు కొనుగోలు చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. 

టీమిండియా తరుపున 18 టెస్టులు ఆడి 768 పరుగులు చేసిన సురేష్ రైనా, 226 వన్డేల్లో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 5615 పరుగులు చేశాడు. 78 టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 1605 పరుగులు చేశాడు.