Asianet News TeluguAsianet News Telugu

బ్యాట్ పట్టిన షమీ: 2020 ఘోరాలు అంటూ ట్రోల్ చేసిన టీం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొహమ్మద్ షమీ ప్యాడ్స్ కట్టుకుంటూ బ్యాటింగ్ కు దిగే పీక పిక్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

mohammed shami pads up: Team trolls as 2020's outcomes
Author
Dubai - United Arab Emirates, First Published Sep 3, 2020, 12:20 PM IST

ఐపీఎల్ సమీపిస్తుండడంతో అన్ని జెట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొహమ్మద్ షమీ ప్యాడ్స్ కట్టుకుంటూ బ్యాటింగ్ కు దిగే పీక పిక్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

పోస్ట్ చేస్తూ.... చూడండి 2020 ఎం చేసిందో. ఆఖరకు షమీ కూడా బ్యాటింగ్ కు సిద్ధమవుతున్నాడు అని రాసుకొచ్చింది. ఈ ఫన్నీ కామెంట్ కి ఫాన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఒకరేమో ఆఖర్లో షమీ మెరుపులు మెరిపిస్తాడు అంటుంటే... మరొకరేమో ప్యాడ్స్ కట్టుకుంటే తప్పా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ మాట్లాడుతూ షమీ వంటి ప్లేయర్స్ టీం లో చాలా కీలకం అని, వారి వంటి వారు టీం కి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారని, టీంలోని జూనియర్లకు ఆదర్శం అని రోడ్స్ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే... బయో సెక్యూర్‌ బబుల్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెటింగ్ టాలెంట్ ను పక్కకు నెట్టి.. మానసిక ధృడత్వంపై ఫోకస్‌ను మరల్చింది. ప్రతి ప్రాంఛైజీ సైకాలజిస్ట్‌లను నియమించుకునే పనిలో నిమగమయ్యాయి. 

ఇకపోతే...  సురేశ్‌ రైనా బాటలోనే మరికొందరు క్రికెటర్లు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోందని మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ అభిప్రాయపడ్డాడు. ' ఈ ఐపీఎల్‌లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. అభిమానులతో కిక్కిరిసిన మైదానాల్లో నాన్‌ క్రికెటింగ్‌ అంశాలతో ప్రేరణ పొంది రెచ్చిపోయే ఆటగాళ్లకు ఇప్పుడు ఆ కిక్‌ ఉండదు. 

మైదానంలో ఒత్తిడికి లోనయ్యే క్రికెటర్లు ఇప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఆటపై పూర్తి దృష్టి నిలిపనున్నారు. విరాట్‌ కోహ్లి వంటి క్రికెటర్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. మానసిక ఒత్తిడితో కూడుకున్న బయో సెక్యూర్‌ బబుల్‌ ఐపీఎల్‌లో సురేశ్‌ రైనా దారిలోనే మరికొందరు క్రికెటర్లు పయనించే అవకాశం మెండు' అని ప్యాడీ అప్టన్‌ అన్నాడు.

శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌, యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2009 నుంచి ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లసిత్‌ మలింగ ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక వహించాడు. 

2013, 2015, 2019 సీజన్లలో అంతిమ పోరులో (మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ రన్నరప్‌) లసిత్‌ మలింగ మ్యాజిక్‌తో ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. 2019 హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో షార్దుల్‌ ఠాకూర్‌ను బోల్తా కొట్టించి మలింగ ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని ముంబయి గూటికి చేర్చాడు. 

మలింగ తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా బాగోలేదు. త్వరలోనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంతో పాటు ఉండేందుకు మలింగ మొగ్గుచూపుతున్నాడు. మలింగ నిర్ణయాన్ని ముంబయి ఇండియన్స్‌ ప్రాంఛైజీ గౌరవించింది. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ పాటిన్సన్‌ను ఎంపిక చేసుకుంది. పరిస్థితులు అనుకూలిస్తే సీజన్‌ ఆఖర్లో లసిత్‌ మలింగ ముంబయి ఇండియన్స్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios