Asianet News TeluguAsianet News Telugu

షమీకి కూతురిని దూరం చేసే పనిలో జహాన్..!

భార్య హసీన్‌తో దూరంగా ఉంటున్న షమీ కేవలం ఐరా కోసం అప్పుడప్పడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. తాజాగా షమీ గారాల పట్టి ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్‌ జహాన్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

mohammed shami estranged  wife hasin jahan drops his surname from daughter's name
Author
Hyderabad, First Published Feb 3, 2021, 7:56 AM IST

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ కి భార్య హసీన్ జహాన్ కి మరో షాక్ ఇచ్చేలా కనపడుతోంది.  షమీ ప్రస్తుతం జట్టులో ఉంటూ.. తన కెరీర్ ని ప్రశాంతంగా సాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఆయన వైవాహిక జీవితం మాత్రం ప్రశాంతంగా సాగలేదు. ఆయన చాలా ఒడిదడుగులు చవిచూశారు. షమీ మీద ఆయన భార్య చాలా ఆరోపణలు చేశారు.

చివరకు ఆ ఆరోపణలు నిజం కాదని తేలింది. దీంతో.. 2018లో షమీతో విభేదాలు రావడంతో అతని భార్య హసీన్‌ జహాన్‌ అప్పటినుంచి వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. షమీకి తన కూతురు ఐరా అంటే చాలా ఇష్టం. భార్య హసీన్‌తో దూరంగా ఉంటున్న షమీ కేవలం ఐరా కోసం అప్పుడప్పడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. తాజాగా షమీ గారాల పట్టి ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్‌ జహాన్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటీవలే హసీన్‌ జహాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  కూతురు ఐరా ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోలో ఐరా పేరుకు షమీ సర్‌నేమ్‌ను తొలగించి 'ఐరా జహాన్‌' అంటూ క్యాప్షన్‌ జతచేసింది. షమీని కూతురుకు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచనతోనే హసీన్‌ జహాన్‌ ఈ పనిచేసినట్లు తెలుస్తుంది. కాగా గతంలోనూ షమీపై గృహ హింస, లైంగిక వేధింపులు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లాంటి ఆరోపణలతో హసీన్‌ జహాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో షమీపై పోలీసులు గతంలో కేసు కూడా నమోదు చేశారు.అప్పట్లో ఈ విషయంపై  సీరియస్‌ అయిన బీసీసీఐ షమీ సెంట్రల్‌ కాంట్రాక్టును కొన్ని రోజులపాటు హోల్డ్‌లో పెట్టింది.  ఆ తర్వాత షమీ హసీన్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టుకెక్కడంతో బీసీసీఐ అతని కాంట్రాక్టును తిరిగి పునరుద్దరించింది.

 

కాగా షమీ ఆసీస్‌తో డిసెంబర్‌లో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే.మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్‌ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో చివరగా బ్యాటింగ్‌కు వచ్చిన షమీ మణికట్టు గాయంతో రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎక్స్‌-రేలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో మిగిలిన టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌కు కూడా షమీ దూరంగా ఉన్నాడు. టీమిండియా తరపున షమీ ఇప్పటివరకు 50 టెస్టుల్లో 180 వికెట్లు, 79 వన్డేల్లో 148 వికెట్లు, 12 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios