Asianet News TeluguAsianet News Telugu

కౌంటీల్లో మ్యాజిక్ చేసిన మహ్మద్ సిరాజ్... మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో చెలరేగి...

వార్‌విక్‌షైర్ తరుపున బరిలో దిగిన మహ్మద్ సిరాజ్... తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన.. 

Mohammad Siraj picks 5 Wickets in County Championship for Warwickshire
Author
First Published Sep 13, 2022, 5:37 PM IST

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. వైట్ బాల్ క్రికెట్‌లో మహ్మద్ సిరాజ్‌కి చోటు దక్కకపోవడంతో అతను ప్రస్తుతం వార్‌విక్‌షైర్ తరుపున బరిలో దిగుతున్నాడు... సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 ఓవర్లలో 6 మెయిడిన్లతో 82 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్...

వార్‌విక్‌షైర్ తరుపున బరిలో దిగిన మరో భారత బౌలర్ జయంత్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సోమర్‌సెట్, సిరాజ్ మ్యాజిక్ స్పెల్ కారణంగా 65.4 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

పాక్ బ్యాటర్ ఇమామ్ వుల్ హక్‌ని 5 పరుగులకే పెవిలియన్ చేర్చిన మహ్మద్ సిరాజ్, 12 పరుగులు చేసిన బార్లెట్, 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన లూయిస్ గ్రేగోరీ, 21 పరుగులు చేసిన డేవీని అవుట్ చేశాడు. వికెట్ కీపర్ జెమ్స్ రాని డకౌట్ చేసిన మహ్మద్ సిరాజ్... కారణంగా 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది సోమర్‌సెట్...

అయితే పాక్ బౌలర్ షాజిద్ ఖాన్ 64 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ హెన్రీ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో రోబర్ట్ యేట్స్ డకౌట్, అలెక్స్ డేవిస్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది వార్‌విక్‌షైర్...

సుర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తింగ్‌ప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసింది. ఓపెనర్ ఎమిలో గే 189 బంతుల్లో 17 ఫోర్లతో 145 పరుగులు చేయగా రాబ్ కోగ్ 180 బంతుల్లో 15 ఫోర్లతో 123 పరుగులు చేశాడు. సుర్రే తరుపున ఆడుతున్న విండీస్ బౌలర్ కీమర్ రోచ్ 20 ఓవర్లలో 5 వికెట్లు తీయగా వోరాల్, గుస్ అట్కీసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి...

ఎసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యార్క్‌షైర్ క్లబ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జార్జ్ హిల్ 76 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేయగా టాట్టర్‌సాల్ 32 పరుగులు చేశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లలో చాలా మంది చక్కని ప్రదర్శన ఇచ్చారు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడిన ఛతేశ్వర్ పూజారా 1000+ పరుగులు చేసి అదరగొట్టగా ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ కూడా తమ జట్ల తరుపున చక్కని ప్రదర్శన కనబరిచారు.. 

Follow Us:
Download App:
  • android
  • ios