సిరాజ్ మియ్యా ఆన్ ఫైర్.. 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక! ఒకే ఓవర్‌లో 4 వికెట్లు...

Asia Cup 2023 Final: ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. 12 పరుగులకే  6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక..

Mohammad Siraj picks 3 wickets in one over, Sri Lanka lost 4 early wickets, Asia cup 2023 Final CRA

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. జస్ప్రిత్ బుమ్రా మొదటి ఓవర్ మూడో బంతికే వికెట్ తీయగా మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. 2 బంతులు ఆడిన కుసాల్ పెరేరా, బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే సధీర సమరవిక్రమ కూడా డకౌట్ అయ్యాడు..

2 బంతులు ఆడిన సధీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. సమరవిక్రమ డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక ఎక్కువగా కుసాల్ పెరేరా, సధీర సమరవిక్రమలపైనే ఆధారపడింది. ఈ ఇద్దరూ డకౌట్ కావడంతో ఆ ప్రభావం, లంకపై తీవ్రంగా పడవచ్చు..

సమరవిక్రమ అవుటైన తర్వాతి బంతికే చరిత్ అసలంక కూడా ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్‌కి హ్యాట్రిక్ దక్కకుండా అడ్డుకోగలిగాడు. అయితే ఆ తర్వాతి బంతికి అతను కూడా అవుట్ అయ్యాడు..

2 బంతుల్లో ఓ ఫోర్ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది శ్రీలంక.. 

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్. తన తర్వాతి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకని పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. శనక నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయడంతో పూర్తిగా విఫలమైన శనక, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios