లార్డ్స్ టెస్టులో 8 వికెట్లు తీసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్... రెండో టెస్టు విజయం తర్వాత లార్డ్స్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో క్రేజీ సెలబ్రేషన్స్...

లార్డ్స్ టెస్టులో దక్కిన ఘన విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆ సంతోషాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో స్టెప్పులు వేసి సెలబ్రేట్ చేసుకున్నాడు... సిరాజ్ ఎప్పుడు వికెట్ తీసినా, తనతో కలిసి సెలబ్రేట్ చేసుకునే క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి స్టెప్పులు వేశాడు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

ఈ విజయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన మహ్మద్ సిరాజ్... ‘మనల్ని మనం నమ్ముకోవడంలోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ చేయగలిగితే, ఏదైనా చేయగలరు... వాట్ ఏ విన్... జట్టు మొత్తం కలిసి పోరాడింది...’ అంటూ మియా మ్యాజిక్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్వీట్ చేశాడు...

View post on Instagram

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన మహ్మద్ సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వికెట్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు... మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ కలిసి 16 ఓవర్లకు పైగా వికెట్లకు అడ్డుగా నిలబడిన సమయంలో సిరాజ్, ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అలాగే మొయిన్ ఆలీ అవుటైన తర్వాత సామ్ కుర్రాన్‌ను డకౌట్ చేసిన సిరాజ్... ఆ తర్వాత జోస్ బట్లర్, జేమ్స్ అండర్సన్‌లను అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.