టీమిండియా కెప్టెన్ రోహిత్ కెప్టెన్సీ సూపర్ అని, కీలక సమయాల్లో అతని నిర్ణయాలు అద్భుతం అని భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించారు.
టీ20 ప్రపంచకప్ లో బ్యాటర్ గా పెద్దగా రాణించలేకపోతున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. కీలక సమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. నవంబర్ 10న ఇంగ్లాండ్తో సెమీస్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ నాయకత్వంపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ప్రశంసలు కురిపించింది. ఐసీసీకి సంబంధించి రాసిన వ్యాసంలో మిథాలీరాజ్ పలు విషయాలను పేర్కొంది.
ప్రపంచకప్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ తీరు బాగుంది. అందులోనూ కొన్ని క్లిష్ట సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం అద్భుతం. అయితే కెప్టెన్సీ ఇంకా మెరుగ్గా చేయవచ్చని వాదించేవారూ లేకపోలేదు. కానీ, చాలా ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకోవడం సారథికి కత్తిమీద సామే. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అలాంటప్పుడు జట్టును లక్ష్యం వైపు నడిపించేలా చేయడం ప్రతి కెప్టెన్ బాధ్యత. టైటిల్ విజేత గా నిలపడంలో సారధి చాలా కీలకం. ఏదైనా మ్యాచ్ లో ఓడినా సరే ఆ ప్రభావం చెట్టు మీద పడనియ్యకుండా చూడాలి అని తెలిపింది.
స్టార్ ప్లేయర్లు ఏం చేయలేరు! టీమిండియాకి అతనితోనే అసలు సమస్య... సామ్ కుర్రాన్ ఏం చేస్తాడోనని...
ఇదిలా ఉండగా, నవంబర్ 6న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన icc t20 world cup 2022 తన చివరి సూపర్ తొలి మ్యాచ్లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్దశతకమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసిన హార్థిక్ పాండ్యా బౌలింగ్ కూడా భారత్ కు అతి పెద్ద సానుకూలతగా నిలిచింది ఏడో ఓవర్లో పాండ్యా తన సొంత బౌలింగ్లో సీన్ విలియంసన్స్ ను అద్భుతమైన వన్ హ్యాండ్ క్యాచ్ తో అవుట్ చేశారు. అయితే ఈ క్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ఆ క్యాచ్ పట్టిన తర్వాత హార్దిక్, రోహిత్ లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. దీన పై అభిమానులు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
అంతకుముందు పురుషుల టి20 ప్రపంచ కప్ లో రాహుల్ తన రెండో రౌండ్ అర్థసెంచరీలో ఆల్ క్లాస్, పవర్ ను సాధించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి అర్థ సెంచరీతో జింబాబ్వేపై 20 ఓవర్లలో186/ 5 స్కోరుతో భారత్ ను భారీ స్కోరుకు తీసుకువెళ్లాడు. రాహుల్ తన 35 బంతుల్లో 51 పరుగులూ తీసి.. మూడు ఫోర్లు, సిక్సర్లతో భారత్ కు శుబారంభం అందించిన తరువాత, విరాట్ కోహ్లీతో కలిసి రెండో విెట్ కు 48 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. కానీ సూర్యకుమార్ డెత్ ఓవర్లలో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 244 స్ట్రైక్ రేట్ వ్ద మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ టెంపోను మళ్లీ మార్చాడు. అతడి ట్రేడ్ మార్క్ స్కూప్ లు, మంత్రముగ్ధులను చేసే లాప్టెడ్ షాట్ లతో చివరి ఐదు ఓవర్లలో భారత్ 79 పరుగులు చేసింది.
