Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగిన సురేష్ రైనా... డచ్‌ రాజధానిలో రైనా ఇండియన్ రెస్టారెంట్‌ ప్రారంభం...

నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ రెస్టారెంట్‌ని ప్రారంభించిన సురేష్ రైనా... భారత దేశంలోని అన్ని ప్రాంతాల రుచులను నేరుగా యూరప్‌కి తేవడమే లక్ష్యమంటూ... 

Mister IPL Suresh Raina opens an Indian Restaurant in Amsterdam CRA
Author
First Published Jun 23, 2023, 4:01 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ రెస్టారెంట్‌ని ప్రారంభించిన సురేష్ రైనా, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. 

‘అమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్‌ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో, వంట చేయడం కూడా అంతే ఇష్టం. అయితే నా అభిరుచికి తగ్గట్టుగా ఈ రెస్టారెంట్‌ని రూపొందించబోతున్నా...

నాకు రుచికరమైన భోజనం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. నేను ఆహారాన్ని అభిమానిస్తాను, ప్రేమిస్తాను. వంటలో నేను చేసే వింత వింత ప్రయోగాలు కూడా చాలా మంది చూశారు. వాటన్నింటితో పాటు భారత దేశంలోని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని ప్రాంతాల నుంచి మోస్ట్ పాపులర్ రుచులను నేరుగా యూరప్ గుండెకాయ లాంటి డచ్‌కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నా...

2019 ఆగస్టు 15న టీమిండియా మాజీ కెప్టెన్, తన ఆప్తమిత్రుడు మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే, ‘నేస్తమా... నీతోనే నేను’ అంటూ సురేష్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు..

2021 ఐపీఎల్ తర్వాత 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిన సురేష్ రైనా, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా మారిన సురేష్ రైనా, లంక ప్రీమియర్ లీగ్ 2023 పాల్గొనబోతున్నాడని ప్రచారం జరిగింది..

అయితే ఎల్‌పీఎల్ 2023 వేలంలో సురేష్ రైనా పేరుని యాక్షనర్ చారు శర్మ మరిచిపోవడం, హాట్ టాపిక్ అయ్యింది. రైనా, వైల్డ్ కార్డు ఎంట్రీగా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడని ప్రచారం జరిగింది. 

అయితే సురేష్ రైనా అసలు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని కూడా అనుకోలేదని, అతను వేలానికి కూడా రిజిస్టర్ చేయించుకోలేదని... కేవలం ఇదంతా ఎల్‌పీఎల్ నిర్వాహకుల పబ్లిసిటీ స్టంట్ అని వార్తలు వచ్చాయి...  దీని గురించి ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఇప్పటిదాకా స్పందించలేదు. 

విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్ వంటి క్రికెటర్లకు ఇప్పటికే రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వీరిలో చాలామంది ఇండియాలో హోటల్ వ్యాపారాలు పెడితే, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా మాత్రం ఏకంగా నెదర్లాండ్స్‌లో తన రెస్టారెంట్‌ని ప్రారంభించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios