ఇద్దరు పిల్లలకు తల్లైనా.. ఆమెలో అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కాగా.. మీరా రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది.
బాలీవుడ్ అర్జున్ రెడ్డి.. షాహిద్ కపూర్ అందరికీ పరిచయమే. ఆయన భార్య మీరా రాజ్ పుత్ కూడా చాలా మంది సినీ ప్రముఖులకు సుపరిచితమే. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. ఆమెలో అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కాగా.. మీరా రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెస్షన్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్ ఏబి డివిలియర్స్ అంటే క్రష్, ఐ లవ్ హిమ్’ అంటూ మీరా సమాధానం ఇచ్చారు.
క్షణం ఆలోచించకుండా ఓపెన్‌గా ఆమె చెప్పిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్-మీరాలు 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్‌లు ఉన్నారు. షాహిద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు రీమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 23, 2021, 2:35 PM IST