Asianet News TeluguAsianet News Telugu

MIvsRCB: పడిక్కల్ హాఫ్ సెంచరీ... బుమ్రా మ్యాజిక్‌కి రాయల్ ఛాలెంజర్స్ షాక్...

సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ చేసిన దేవ్‌దత్ పడిక్కల్...

విఫలమైన కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్...

7 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

మూడు వికెట్లు తీసిన బుమ్రా... 

MI vs RCB: Devdutt padikkal Half century help rcb for decent Score CRA
Author
India, First Published Oct 28, 2020, 9:07 PM IST

IPL 2020: టాస్ ఓడి, బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆరంభించడంతో 7.5 ఓవర్లలో 71 పరుగులు వచ్చాయి. 180+ నుంచి 200+ స్కోరు చేస్తుందని అనుకున్న ఆర్‌సీబీకి బుమ్రా ఊహించని షాక్ ఇచ్చాడు.

జోస్ ఫిలిప్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేయగా... విరాట్ కోహ్లీ 9, ఏబీ డివిల్లియర్స్ 15, శివమ్ దూబే 2, క్రిస్ మోరిస్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 45 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసి మరోసారి మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాయి.

ఒకానొకదశలో 15.2 ఓవర్లలో 131/2 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే వరుసగా వికెట్లు తీసిన ముంబై బౌలర్లు, రాయల్ ఛాలెంజర్స్‌పై ఒత్తిడి పెంచారు. 7 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖర్లో గురుకీరత్ 14 పరుగుల ఇన్నింగ్స్ కారణంగా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios