IPL 2020: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ముంబై బౌలర్లు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే కమ్మిన్స్, మోర్గాన్ ఇన్నింగ్స్ కారణంగా ఓ మాదిరి స్కోరు అయినా చేయగలిగింది కేకేఆర్. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది కేకేఆర్.. రాహుల్ త్రిపాఠా 7 పరుగులకే అవుట్ కాగా, నితీశ్ రాణా 5, దినేశ్ కార్తీక్ 4 పరుగులకే అవుట్ అయ్యారు.  

ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ కాగా... గిల్ అవుటైన తర్వాతి బంతికే దినేశ్ కార్తీక్‌ను అవుట్ చేసి కేకేఆర్‌కి షాక్ ఇచ్చాడు రాహుల్ చాహార్. డేంజరస్ బ్యాట్స్‌మెన్ 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్ బాది 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కత్తాను ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమ్మిన్స్ కలిసి ఆదుకున్నారు.

ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి అజేయంగా 87 పరుగులు జోడించగా ప్యాట్ కమ్మిన్స్ 36 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, మోర్గాన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహాల్ 2 వికెట్లు తీయగా కాంట్రెల్ నైల్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా తలా ఓ వికెట్ తీశారు.