Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: ఇదో పనికిమాలిన సిరీస్.. ఇండియా-కివీస్ టీ20 షెడ్యూల్ పై న్యూజిలాండ్ బౌలర్ షాకింగ్ కామెంట్స్

Mitchell Mccleanghan: టీమిండియాతో జరిగిన గత రెండు టీ20లలో ఓడిన కివీస్ పై ఆ జట్టు బౌలర్ మెక్లీన్గన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదో అర్థం పర్థం లేని సిరీస్ అని పేర్కొన్నాడు.

Meaningless Series, New Zealand Bowler Mitchell McClenaghan Comments on India Vs New Zealand T20I Schedule
Author
Hyderabad, First Published Nov 21, 2021, 1:33 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ కు వెళ్లిన న్యూజిలాండ్ (New Zealand).. తుది పోరులో ఆసీస్ (Austrlaia) తో అనూహ్యంగా ఓడింది. నవంబర్ 14న ఫైనల్ ముగిసిన వెంటనే ఆ జట్టు.. మరుసటి రోజు రాత్రి Indiaకు చేరుకుంది. భారత్ తో ఆ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు వచ్చింది. ఇప్పటికే రెండు టీ20 లు ముగియగా.. నేడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ (Eden Garden) లో మూడో టీ20 జరుగనుంది.  గత రెండు టీ20లలో ఓడిన కివీస్ పై ఆ జట్టు బౌలర్ మెక్లీన్గన్ (Mitchell Mccleanghan) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదో అర్థం పర్థం లేని సిరీస్ అని..  ఓ భారీ టోర్నీ జరిగిన 72 గంటల్లోపే మరో ద్వైపాక్షిక సిరీస్ ఏర్పాటు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించాడు. ఇప్పటికే తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఇండియాతో సిరీస్ కోల్పోయామని ఆ జట్టు తాత్కాలిక సారథి టిమ్ సౌథీ (Tim Southee) వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా మెక్లీన్గన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన మెక్లీన్గన్.. ‘టీ20 ప్రపంచకప్ ముగిసిన మూడు రోజుల్లో (72 గంటలు)నే సిరీస్ జరుపడం అర్థం లేని పని. ఒక మెగా టోర్నీ ఆడి రెండు జట్లు అలసిపోయాయి. ఇక న్యూజిలాండ్ ఆసీస్ తో జరిగిన ఫైనల్ లో ఓడి నేరుగా ఇండియాకు చేరుకుంది. కనీసం ఆ జట్టుకు సేద తీరడానికి విశ్రాంతి కూడా దొరకలేదు. దీంతోనే కివీస్.. ఇండియాతో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ అప్పగించింది..’ అని  పేర్కొన్నాడు. 

 

నవంబర్ 14న ఫైనల్ ముగియడంతోనే కివీస్ సరాసరి భారత్ ఫ్లైట్ ఎక్కింది. మెక్లీన్గన్ చెప్పినట్టు ఆ జట్టుకు విశ్రాంతి దొరకనేలేదు. దీంతో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ తో పాటు కైల్ జెమీసన్ కూడా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఇక అంతకుముందే గాయం కారణంగా డావెన్ కాన్వే కూడా టీ20లతో పాటు టెస్టు సిరీస్ నుంచి కూడా దూరమయ్యాడు. 

ఈ నేపథ్యంలో  ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. ‘ఓ  మెగా టోర్నీ తర్వాత వెంటనే మరో సిరీస్ ఆడటం బహుశా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది నిజంగా సవాలుతో కూడుకున్నదే. అయితే ఇది మా చేతుల్లో లేని పని..’ అని అన్నాడు. ఇక టిమ్ సౌథీ కూడా.. తాము తీరిక లేని క్రికెట్ ఆడుతున్నామని వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Follow Us:
Download App:
  • android
  • ios