ఐపీఎల్.. ఈ మెగా లీగ్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. దుబాయ్‌లోని అబుదాబి వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్. తన హాట్ హాట్ అందాలతో క్రికెట్ మ్యాచులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారే యాంకర్ మయంతి లంగర్ ఈ సీజన్‌లో పాల్గొనడం లేదు. 

క్రికెట్ చూసే చాలామందికి యాంకర్ మయంతి లంగర్ హాట్ ఫెవరేట్. వ్యాఖ్యతగా ఆమె చేసే భారీ అందాల ప్రదర్శన కోసమే, బ్రేక్ టైమ్‌లో కూడా ఛానెల్ మార్చకుండా చూస్తారు. క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని పెళ్లాడిన మయంతి, వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదు.

గత సీజన్‌లో బిన్నీ రాజస్థాన్ తరుపున ఆడాడు. ఆడిన కొన్ని మ్యాచుల్లో ఆకట్టుకోలేకపోవడంతో ఈసారి అతన్ని కొనడానికి ఏ ప్రాంఛైసీకి కూడా ఆసక్తి చూపలేదు. దీంతో క్రికెటర్‌గా స్టువర్ బిన్నీ, వ్యాఖ్యతగా మయంతి లంగర్ ఇద్దరూ ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నారు.