మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యుత్తమ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి వరుసలో వుంటుంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు లేదు. రెండేళ్ల నిషేదానికి గురయినా, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రబావం చూపలేకపోయింది. అందుకు కారణమేంటని ప్రశ్నిస్తే కెప్టెన్ కూల్ ధోని అనే సమధానం అభిమానుల నుండి వస్తుంది. కానీ ఆ జట్టు సభ్యుడైన షేన్ వాట్సన్ మాత్రం కెప్టెన్-కోచ్ కాంబినేషనే సీఎస్కే అత్యుత్తమ ప్రదర్శను కారణమంటున్నాడు.
ఇప్పటివరకు తాను చూసిన కెప్టెన్-కోచ్ కాంబినేషన్లలలో ఎంఎస్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లదే అత్యుత్తమమని వాట్సన్ కొనియాడాడు. వీరిద్దరి వల్లే సీఎస్కే ప్రతి సీజన్లోను అదరగొడుతోందని అన్నారు. గతంలో తాను వివిధ జట్లకు ప్రాతినిద్యం వహించాను. కానీ ఇలాంటి మంచి అండస్టాండింగ్ కలిగిన కెప్టెన్-కోచ్ కాంబినేషన్ ను ఎక్కడా చూడలేదని పేర్కొన్నాడు.
''చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపిఎల్ లో తిరుగులేని ప్రదర్శన చేయడానికి సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే కారణం. అయితే ఆ ప్రణాళికను రూపొందించడంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, కోచ్ ప్లెమింగ్ లదే ముఖ్య పాత్ర. వారిద్దరరు మంచి సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ఎంతో సహకరిస్తాయి. అందువల్లే సీఎస్కే విజయాల రేటు ఎక్కువగా వుంది. అందువల్ల కేవలం ఐపిఎల్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లో వీరిద్దరి కాంబినేషన్ అత్యుత్తమమని ఎలాంటి సందేహం లేకుండా చెబుతాను.
సీఎస్కే జట్టులోని అందరు ఆటగాళ్లతో వీరిద్దరికి మంచి సంబంధాలుంటాయి. కాబట్టి ఎవరిలో ఏ సత్తా దాగుందో ఇట్టే గుర్తుపట్టగలరు. అలా ఎంతో మంది యువకులు వీరిద్దరి ప్రోత్సాహంతో జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాంటి వారిలో చాలామంది ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్లుగా కూడా ఎదిగారు. ధోని కూల్ కెప్టెన్సీ, ఫ్లెమింగ్ పర్యవేక్షణ ద్వారా సీఎస్కే ఆటగాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. భవిష్యత్ లో కూడా మరెన్నో నేర్చుకోడానికి సిద్దంగా వున్నారు.'''' అంటూ ధోని-ప్లెమింగ్ లపై వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 15, 2019, 6:15 PM IST