క్రికెట్‌లో షాహిది ఆఫ్రిదీకి ఓ స్పెషాలిటీ ఉంది. తనదైన రోజున సిక్సర్లతో విరుచుకుపడే ఆఫ్రిదీ... డిఫెన్స్ ఆటను ఏ మాత్రం ఇష్టపడడు. అందుకే డకౌట్‌ అవ్వడంలో రికార్డు క్రియేట్ చేశాడు షాహిది ఆఫ్రిదీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ తర్వాత ఇప్పుడు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న షాహిది ఆఫ్రిదీ... ఆఫ్ఘాన్ యువ పేసర్‌పై నోరుపారేసుకోవడం వివాదాస్పదమైంది...

గాలే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న షాహిది ఆఫ్రిదీ, కాండీ టస్కర్స్ తరుపున ఆడుతున్న ఆఫ్ఘాన్ యువ బౌలర్ నవీన్ హుల్ హక్‌ను దూషించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాను నవీన్‌ హుల్ హక్‌ను తిట్టలేదని చెప్పుకొచ్చాడు ఆఫ్రిదీ.

‘నేను నవీన్‌ను తిట్టలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నవీన్ దగ్గరికి వచ్చినప్పుడు కాస్త సీరియస్ అయ్యాను. మ్యాచు ఆడుతున్నప్పుడు అనవసరంగా మిగిలిన ప్లేయర్లపై నోరు పారేసుకోకూడదని చెప్పాను... అంతే. క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించడం ఆటలో ప్రాథమిక ధర్మం...’ అంటూ వివరించాడు షాహిది ఆఫ్రీది.