టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా.. తన భార్యతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఆ ఫోటో చూసి.. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీజ్ చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... రోహిత్ శర్మ.. తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. భార్య, కుమార్తెకు సంబంధించిన ఫోటోలను రోహిత్..  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా ఓ ఫోటోని షేర్ చేశారు. అందులో తన భార్యను వెనక నుంచి హత్తుకొని కూర్చొని ఉన్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Always hold on to what you love ❤️

A post shared by Rohit Sharma (@rohitsharma45) on Jul 4, 2020 at 5:30am PDT

దానికి కాప్షన్ కూడా జత చేశారు. ‘‘ మీరు ప్రేమించిన దానిని ఎప్పుడూ పట్టుకొని ఉండండి’’ అనే అర్థం వచ్చేలా ఆయన క్యాప్షన్ ఇవ్వగా.. దానికి యువరాజ్ రిప్లై ఇచ్చాడు.

‘‘ నాకు నీ బుగ్గలు అంటే ఇష్టం. వాటిని నేను పట్టుకోవచ్చా’’ అంటూ యువరాజ్ కామెంట్ చేయడం గమనార్హం. కాగా.. యూవీ చేసిన కామెంట్.. నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది. కాగా.. యూవీ కామెంట్ కి నెటిజన్ల స్పందన కూడా బాగుంది. కొందరు మీరు.. రితిక పర్మిషన్ తీసుకోవాలంటూ స్పందిస్తున్నారు. కాగా.. వారి కామెంట్స్ తో.. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.