ఓ కుర్రాడు క్రికెట్‌లో అతి కష్టమైన షాట్లను చాలా ఈజీగా అదరగొడుతున్న వీడియో... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ కుర్రాడు బ్యాటింగ్ చేసింది బ్యాటుతో కాదండోయ్... వికెట్‌ స్టంప్‌తో!.. హా... అవును..

సాధారణంగా బ్యాటుతో ఆడితేనే బాల్ మిస్ అయ్యి, వికెట్ ఎగిరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వికెట్ స్టంప్‌తో చూడముచ్చటైన స్టైయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లను అవలోకగా ఆడేశాడు ఈ కుర్రాడు.

తన ఆటతో సచిన్, కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తుకుతెస్తున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఈ కుర్రాడు ఎవరు? ఇది ఏ ప్రాంతంలో తీసిన వీడియో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.