ఆస్ట్రేలియా జట్టు ఆటగాడిగా కంటే, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గానే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు డేవిడ్ వార్నర్. ‘వార్నర్ భాయ్’, ‘డేవిడ్ భాయ్’ అంటూ తనని ముద్దుగా పిలిచే తెలుగువాళ్లంటే డేవిడ్ వార్నర్‌కి అమితమైన అభిమానం. ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి డేవిడ్ వార్నర్ ఇచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు...

రోజుకో కొత్త వీడియో, తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను అలరిస్తున్న డేవిడ్ వార్నర్ వచ్చే సీజన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ‘తనకు ఇండియా సిరీస్ అయిన గాయం మానడానికి ఆరేడు నెలలు పట్టేలా ఉంది’ అంటూ వార్నర్ చేసిన కామెంట్ల కారణంగా అతను వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనుమానాలు రేగాయి.

 

దీంతో సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్. ‘అద్భుతమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించిన నాకెంతో ఇష్టమైన పని. జట్టులో సభ్యులందరూ, అభిమానులు, యజమానులు, స్టాఫ్, ప్లేయర్స్, ఇంకా గ్రౌండ్ స్టాఫ్ అందరూ మంచివాళ్లే. ఈ ఫ్రాంఛైజీతో ఎప్పుడూ కొందరు అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. వచ్చే సీజన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా’ అంటూ పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్.