Asianet News TeluguAsianet News Telugu

వన్ అండ్ ఓన్లీ.. లసిత్ మలింగ! రెండు సార్లు ‘నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల’ రికార్డు

శ్రీలంక స్టార్ బౌలర్ల జాబితాలో తన పేరు సుస్థిరం చేసుకున్న లసిత్ మలింగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తన రికార్డును 12ఏళ్ల తర్వాత ఆయనే స్వయంగా బ్రేక్ చేశారు. పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు తన పేరిటే ఉన్నది.

lasit malinga breaks self record taking four wickets in four balls
Author
New Delhi, First Published Sep 15, 2021, 4:24 PM IST

న్యూఢిల్లీ: విభిన్న బౌలింగ్ యాక్షన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ మంగళవారం అంతర్జీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. తన యాక్షన్‌తో వేయబోయే బాల్ తీరును కప్పిపెట్టి బ్యాట్‌మెన్‌ను కన్ఫ్యూజ్ చేయడంలో ఆయన దిట్ట. తొలుత ఆయన యాక్షన్‌పై అనుమానాలు వచ్చినప్పటికీ వాటిని తిప్పికొట్టి కెరీర్ ఆసాంతం విజయవంతమైన ఆటగాడిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ల జాబితాలో ఆయన పేరును సుస్థిరం చేసుకున్నాడు. రికార్డులపై రికార్డులు నెలకొల్పాడు. ఆయనకే సాధ్యమైన ఓ రికార్డును మరోసారి ఆయనే తిరగరాశారు. అదే.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డు.

2007లో వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆయన తొలిసారిగా ఈ ఫీట్ సాధించాడు. 45వ ఓవర్‌లో ఆయన చివరి రెండు బంతుల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఒక ఓవర్ గ్యాబ్ తర్వాత వేసిన 47వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లోనే మరో రెండు వికెట్లు తీసి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి హౌరా అనిపించాడు. దాదాపు 12ఏళ్లపాటు చెక్కుచెదరకుండా తన పేరిట ఉన్న ఆ రికార్డును మరోసారి ఆయనే బద్దలు కొట్టాడు.

 

2019లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన రికార్డును బ్రేక్ చేస్తూ వరుసగా నాలుగు బంతుల్లో నలుగురు బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్‌లో మూడో ఓవర్‌లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను ఔట్ చేశాడు. మలింగ తన కెరీర్‌లో శ్రీలంక జట్టు సభ్యుడిగా కెరీర్‌లో 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టీ20లు తరఫున ఆడాడు. టెస్టు(101)లు, టీ20(107)లలో సెంచరీ వికెట్లు తీశాడు. వన్డేల్లో 338 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లో తనకంటూ ప్రత్యేక రికార్డు ఉన్నది. ఈ ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి బౌలరే కాక, అత్యధిక వికెట్లు తీసుకున్నవాడిగానూ రికార్డు నెలకొల్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios