Asianet News TeluguAsianet News Telugu

బెట్టింగ్ కంపెనీలు కూడా.. ఐపీఎల్ టీమ్స్ ని కొంటున్నాయి.. లలిత్ మోడీ ఆగ్రహం..!

ఈ నేపథ్యంలో.. తాజాగా లలిత్ మోడీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డు ఈ ప్రకటన చేసిన వెంటనే, లలిత్ మోడీ బీసీసీఐపై విరుచుకుపడ్డారు.

Lalit Modi takes a dig at BCCI for allowing Betting Investing company to buy IPL Team
Author
hyderabad, First Published Oct 27, 2021, 1:11 PM IST

ఐపీఎల్ లో కొత్తగా రెండు జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  2022 ఐపీఎల్ నుంచి ఈ కొత్త రెండు జట్లు తలపడున్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో.. Indian Premier League (IPL) chairman Lalit Modi చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బెట్టింగ్ కంపెనీలు కూడా.. ఐపీఎల్ టీమ్స్ ని కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు.

 

కాగా.. అహ్మదాబాద్, లక్నో టీములకు వేలం పాట నిర్వహించారు. ఇందులో ఆహ్మదాబాద్ జట్టును సీవీసీ పార్టనర్స్ అనే సంస్థ రూ.5600 కోట్లకు దక్కించుకుంది. లక్నో టీమ్‌ను .. ఆర్పీఎస్‌జీ గ్రూప్ రూ. 7,090 కోట్లకు దక్కించుకుంది. ఈ రెండు జట్ల వాల్యూయేషన్ మధ్య తేడా ఏకంగా పదిహేను వందల కోట్ల వరకూ ఉంది. ఇది ఒక విచిత్రం అయితే.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించున్న సీవీసీ పార్టనర్స్‌కు బెట్టింగ్, గేమింగ్ ను అధికారికంగా నిర్వహించే కంపెనీ ఉంది.

 సీవీసీ పార్టనర్స్ అనే గ్రూప్ ఇండియాలో నిర్వహించే కార్యకలాపాలు తక్కువే. ఎక్కువ యూరప్ దేశాల్లో ఉంటుంది. యూరప్‌లో చాలా దేశాల్లో బెట్టింగ్ చట్టబద్ధం. ఈ బెట్టింగ్, గేంబ్లింగ్ నిర్వహణలో సీవీసీ పార్టనర్స్ సబ్సిడరీ కంపెనీ అయిన స్కై బెట్టింగ్ అండ్ గేమింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ మాతృ సంస్త అయిన సీవీసీ పార్టనర్స్‌ ఇప్పుడు టీమ్‌ను దక్కించుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిర్వహించడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.

ఈ నేపథ్యంలో.. తాజాగా లలిత్ మోడీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డు ఈ ప్రకటన చేసిన వెంటనే, లలిత్ మోడీ బీసీసీఐపై విరుచుకుపడ్డారు. "బెట్టింగ్ కంపెనీలు IPL జట్టును కొనుగోలు చేయవచ్చని నేను ఊహిస్తున్నాను. తప్పక కొత్త నియమం ఉండాలి. స్పష్టంగా, ఒక అర్హత కలిగిన బిడ్డర్ కూడా పెద్ద బెట్టింగ్ కంపెనీని కలిగి ఉన్నాడు. BCCI ఈ విషయంలో కనీసీం ఎలాంటి హోం వర్క్ ఎందుకు చేయలేదు?  అటువంటి సందర్భంలో అవినీతి నిరోధక శాఖ ఏమి చేయగలదు?’’ అంటూ ట్వీట్ చేశారు.  

లలిత్ మోడీ ట్వీట్ ని ఓ ప్రముఖ వార్తా సంస్థ హైలెట్ చేస్తూ.. వార్తలు రాయడం గమనార్హం. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధికారులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios