Asianet News TeluguAsianet News Telugu

KXIPvsRR: కింగ్స్‌ విజయాలకి బ్రేక్... గెలిచి నిలిచిన రాజస్థాన్ రాయల్స్...

బెన్‌స్టోక్స్ మెరుపు హాఫ్ సెంచరీ...

 30 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... 48 పరుగులు చేసిన సంజూ శాంసన్...

7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదు వరుస విజయాలకు ఆరో మ్యాచ్‌లో బ్రేక్...

 

KXIP vs RR: Rajasthan Royals excellent win against Kings XI Punjab CRA
Author
India, First Published Oct 30, 2020, 11:05 PM IST

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్. 186 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి గత మ్యాచ్ సెంచరీ హీరో బెన్ స్టోక్స్ చక్కని ఆరంభాన్ని అందించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భుత హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు బెన్‌స్టోక్స్.

రాబిన్ ఊతప్ప 23 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయగా సంజూ శాంసన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముందు రనౌట్ అయ్యాడు. అప్పటికే రన్‌రేట్ భారీగా పడిపోవడంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్, బట్లర్ కలిసి మిగిలిన లాంఛనాన్ని ముగించారు. స్టీవ్ స్మిత్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31,  జోస్ బట్లర్ 11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేశారు. 

వరుసగా ఐదు మ్యాచులు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, క్రిస్ గేల్ ఎంట్రీ తర్వాత మొదటి మ్యాచ్ ఓడింది. పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న పంజాబ్, కోల్‌కత్తా వరుస మ్యాచుల్లో ఓడడంతో ప్లేఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. రేపు ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే ఆరు జట్ల మధ్య ప్లేఆఫ్ కోసం ఫైట్ జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios