సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్...రెండు క్యాచ్‌లు డ్రాప్ చేసిన బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ...

KXIP vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి కెఎల్ రాహుల్ మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు. అయితే 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత బౌండరీలు బాదేందుకు ఇబ్బంది పడ్డారు పంజాబ్ బ్యాట్స్‌మెన్.

నికోలస్ పూరన్ 18 బంతుల్లో 17, మ్యాక్స్‌వెల్ 6 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వికెట్లు ఉన్నా, ఓవర్లు అయిపోతున్నా బౌండరీలు బాది రన్‌రేట్ పెంచేందుకు చాలా కష్టపడ్డారు రాహుల్ అండ్ కో.
అయితే విరాట్ కోహ్లీ రెండు క్యాచ్‌లు జారవిరచడంతో బతికిపోయిన కెఎల్ రాహుల్, కరణ్ నాయర్‌తో కలిసి బౌండరీల మోత మోగించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్.కరణ్ నాయర్ 15 పరుగులు చేశాడు.

62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న కెఎల్ రాహుల్, శతకం తర్వాత మరింత జోరు పెంచాడు. డేల్ స్టెయిన్ టాప్ క్లాస్ పేసర్ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

శివమ్ దూబేకి రెండు వికెట్లు దక్కగా చాహాల్ ఓ వికెట్ తీశాడు.