మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కెఎల్ రాహుల్...నికోలస్ పూరన్, మన్‌దీప్, మయాంక్ మెరుపులు... వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి మరోసారి మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 61 పరుగులు జోడించిన తర్వాత 19 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ కాగా... మన్‌దీప్ సింగ్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

17 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన నికోలస్ పూరన్, 52 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ వెంటవెంటనే అవుట్ కావడంతో పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఆఖరి ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు బాదడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... శార్దూల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా పియూష్ చావ్లా, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది.