Asianet News TeluguAsianet News Telugu

కుంబ్లే పెట్టిన కండిషన్ తో షాక్ కి గురైన కుల్దీప్ యాదవ్

ఆస్ట్రేలియా భారత పర్యటనలో ఉంది. భారత్ ‌ఆస్ట్రేలియాతో  ధర్మశాల టెస్టులో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఆ మ్యాచ్‌కు ముందు అనుకోకుండా విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు. కోహ్లి గాయపడడంతో ఆ స్థానాన్ని మరో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ తో నింపుతారు అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా ఆ స్థానాల్లో ఒక బౌలర్ ని తీసుకున్నారు. అతడే చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్.

Kuldeep Yadav Recalls Anil Kumble's words on getting a fifer in his debut test
Author
Hyderabad, First Published May 3, 2020, 7:33 AM IST

2017 ఆస్ట్రేలియా భారత పర్యటనలో ఉంది. భారత్ ‌ఆస్ట్రేలియాతో  ధర్మశాల టెస్టులో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఆ మ్యాచ్‌కు ముందు అనుకోకుండా విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు. కోహ్లి గాయపడడంతో ఆ స్థానాన్ని మరో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ తో నింపుతారు అని అనుకున్నారంతా!

నీ అనూహ్యంగా ఆ స్థానాల్లో ఒక బౌలర్ ని తీసుకున్నారు. అతడే చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్. ‌ అలా అతను అరంగ్రేటం చేశాడు. నిజానికి ఆ టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ ఆడటం కోహ్లికి నచ్చలేదట. 

ఆ సంఘటనతోనే కోచ్‌ కుంబ్లేతో కోహ్లి విభేదాలు మొదలు అయ్యావని కొందరు అంటారు. అది మరోసారి ఎప్పుడైనా కూలంకషంగా మాట్లాడుకుందాము. ఇదిలా ఉండగా ధర్మశాల టెస్టుకు ముందు కోచ్‌ అనిల్‌ కుంబ్లే తనతో చెప్పిన మాటలను కుల్దీప్‌ యాదవ్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 

' ధర్మశాలలో నా టెస్టు అరంగ్రేటం గుర్తుకొస్తే భావోద్వేగానికి లోనవుతా. ఆ సమయంలో ఎలా రాణించాలనే ఎక్కువగా మథనపడేవాడిని. మ్యాచ్‌కు ఓ రోజు ముందు లంచ్‌ సమయంలో కోచ్‌ కుంబ్లే నా వద్దకు వచ్చారు. 

రేపు మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు, ఐదు వికెట్లు పడగొట్టాలి అన్నారు. ఓ క్షణం పాటు ఆగిపోయాను. వెంటనే, తప్పకుండా ఐదు వికెట్లు పడగొడతాను సర్‌ అన్నాను. శివరామకృష్ణన్‌ నా టెస్టు క్యాప్‌ అందించారు. 

ఆ సమయంలో ఆయన ఏదో సలహా ఇచ్చారు. ఆ భావోద్వేగంలో అది నాకు అసలు గుర్తుకులేదు. అరంగ్రేట టెస్టులో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నిరాశకు లోనయ్యాను. లంచ్‌కు ముందు కొన్ని ఓవర్లు వేశాను. ఆ తర్వాత కొంత రిలాక్స్‌ అయ్యాను. 

రంజీ మ్యాచ్‌ తరహాలోనే భావించి ఆడాలనుకున్నాను. టెస్టు క్రికెట్‌ ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా ఉండే ఫార్మాట్‌' అని కుల్దీప్‌ యాదవ్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చి విజయానికి బాటలు వేసిన సంగతి తెలిసిందే.

అలా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి తన అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. ఈ కరోనా ఖాళీ సమయంలో ఇలా కుల్దీప్ తన తొలి టెస్టు అనుభవం గురించి పంచుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios