Asianet News TeluguAsianet News Telugu

రోహిత్‌, కోహ్లీలు కాదు.. ఈ ఏడాది అలా అత్యధికంగా సంపాదించిన ఆటగాడు అతడే..?  

Team India: టీమిండియాలో అత్యధికంగా సంపాదించే ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు టాప్ లో ఉంటారు. వీరు మ్యాచ్‌ ఫీజులు, ఐపీఎల్‌ కాంట్రాక్టులు, బ్రాండ్‌ ప్రమోషన్స్‌లతో ప్రతి యేటా కోటాది రూపాయాలు సంపాదిస్తారు. కానీ ఏడాది అత్యధికంగా మ్యాచ్ ఫీజులు అందుకున్న జాబితా వీరిద్దరూ పేర్లు టాప్ లో లేరు. అనూహ్యంగా  బౌలర్ల టాప్ లో నిలిచారు. ఇంతకీ బౌలర్ ఎవరు? 

Kuldeep Yadav is The Highest-Earning Indian Player Through ODI Match Fees In 2023 KRJ
Author
First Published Dec 24, 2023, 7:33 AM IST

Team India: టీమిండియాలో అత్యధికంగా సంపాదించే ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు ముందువరుసలో ఉంటారు. వారి తరువాతనే ఎవరైనా.. వారు ప్రతి యేటా మ్యాచ్‌ ఫీజులు, ఐపీఎల్‌ కాంట్రాక్టులు, బ్రాండ్‌ ప్రమోషన్స్‌లతో కోట్లలో సంపాదిస్తారు. కానీ, ఈ ఏడాది మ్యాచ్‌ ఫీజుల ద్వారా అత్యధికంగా సంపాదించిన వారిలో రోహిత్‌ గానీ, కోహ్లీ గానీ టాప్ ప్లేస్ లో లేరు. రోహిత్, కోహ్లీలు టాప్ లో లేకపోవడమేంటీ? మరీ మ్యాచ్‌ ఫీజుల ద్వారా అత్యధికంగా సంపాదించిన ఆటగాడెరు? అనుకుంటున్నారా.. ఈ లిస్టులో టాప్ లో నిలిచింది టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌. కుల్ దీప్ యాదవ్ ఏంటీ..? ఆయన అత్యధికంగా పారితోషికం అందుకున్న జాబితాలో ఉండటమేంటని భావిస్తున్నారా? అయితే.. ఈ సోర్టీలోని చదవాల్సిందే.. 
  
కుల్‌దీప్‌ టాప్..

BCCI అధికారిక ప్రకటన ప్రకారం.. భారత క్రికెటర్లు వన్డే ODIలలో ఒక్కో మ్యాచ్‌కి రూ. 6 లక్షలు సంపాదిస్తారు. ఇలా టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొత్తం 30 వన్డే మ్యాచ్‌లు ఆడి రూ. 1.80 కోట్లు ఆర్జించాడు. అలాగే.. ఈ ఏడాది అత్యధిక మ్యాచులు ఆడిన భారత క్రికెటర్ నిలిచారు.  కుల్దీప్ ఆడిన 30 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీసి.. 2023లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. 
  
కుల్దీప్ యాదవ్ తరువాత స్థానంలో శుభ్ మాన్ గిల్ ఉన్నాడు.గిల్ 29 మ్యాచ్‌లు ఆడి రూ. 1.74 కోట్లు సంపాదించాడు. అలాగే.. 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు  (1,584) చేసిన టీమిండియా ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా బీసీసీఐ నుంచి అత్యధిక పారితోషకం అందుకున్న రెండో టీమిండియా ప్లేయర్ గా నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఉన్నారు. వీరు 27 మ్యాచ్‌లు ఆడారు. 2023లో ODI మ్యాచ్ ఫీజు నుండి వీరు 1.62 కోట్ల రూపాయలు సంపాదించారు.

అత్యధికంగా పారితోషకం అందుకున్న టాప్ 10 భారతీయ క్రికెటర్లు 

1. కుల్దీప్ యాదవ్ - రూ. 1.8 కోట్లు
2. శుభమాన్ గిల్ - రూ. 1.74 కోట్లు
3. రోహిత్ శర్మ - రూ. 1.62 కోట్లు
4. విరాట్ కోహ్లీ- రూ. 1.62 కోట్లు 
5. కేఎల్ రాహుల్- రూ. 1.62 కోట్లు
6. రవీంద్ర జడేజా- 1.56 కోట్లు
7. మహ్మద్ సిరాజ్ - 1.5 కోట్లు
8. సూర్యకుమార్ యాదవ్- రూ. 1.26 కోట్లు
9. శ్రేయాస్ అయ్యర్ - రూ. 1.20 కోట్లు
10. హార్దిక్ పాండ్యా- రూ. 1.20 కోట్లు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios