గత రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు చిత్తుగా ఓడింది. రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో పిచ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెట్టేందుకు మొతేరాలో స్పిన్ పిచ్‌ను తయారుచేశారని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో నాలుగో టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్‌ను రూపొందించాలని భావిస్తోందట టీమిండియా.

బ్యాటింగ్ పిచ్‌తో బరిలో దిగి, ఇంగ్లాండ్ జట్టు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తోందట. నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఈ ఇద్దరికీ చోటు కల్పించడం ద్వారా బౌలింగ్ విభాగాన్ని కూడా మరింత పటిష్టం చేసి ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెట్టాలనేది టీమిండియా ఆలోచన. అవసరమైతే హార్ధిక్ పాండ్యాని కూడా బరిలో దింపాలని భావిస్తోంది టీమిండియా. అయితే పాండ్యా వస్తే, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.