సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాజత్ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. రిపల్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన తమిళనాడు జట్టు తరుపున ఆడిన షారుక్ ఖాన్‌ను రూ.5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 2018-19 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఖాన్, ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

5 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 231 పరుగులు చేసిన షారుక్ ఖాన్, 31 టీ20 మ్యాచుల్లో 293 పరుగులు చేశాడు. లిస్టు ఏ క్రికెట్‌లో 20 మ్యాచులు ఆడి 286 పరుగులు చేసిన షారుక్ మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు.

కృష్ణప్ప గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, చెన్నై జట్లు పోటీపడ్డాయి. రూ.9 కోట్ల 25 లక్షలకు గౌతమ్‌ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో రాణించిన విష్ణు సోలంకి వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. విష్ణు వినోద్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.