IPL 2021 CSK VS KKR : ఐపీఎల్ రెండో ఫేజ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2021 ఎడిషన్ రెండో ఫేజ్ లోని 38 వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ ఫిచ్ నెమ్మదిగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేయడమే మేలని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ నెగ్గిన అనంతరం చెప్పుకొచ్చాడు. కాగా నేటి మ్యాచ్ లో కేకేఆర్ తరఫున ఎలాంటి మార్పులు లేకపోయినా చెన్నైకి మాత్రం ఆ జట్టు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్ కు ఆడటం లేదు. స్వల్ప గాయంతో బాధపడుతున్న బ్రావో స్థానంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను ఆడించనున్నట్టు సీఎస్కే తెలిపింది.