కోహ్లీకి జనవరి 15వ తేదీన ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అదరకొట్టాడు. మామలూగా అదరగొట్టడం కూడా కాదు. సెంచరీ పక్కా. ఇది చాలాసార్లు ప్రూవ్ కావడం గమనార్హం.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంక్రాంతి పండగ బాగా కలిసోస్తోంది. ఆ రోజు ఆయన మ్యాచ్ ఆడినా.. అదరగొట్టేస్తున్నాడు. గత కొంతకాలం క్రితం ఫామ్ కోల్పోయిన కోహ్లీ..... మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరసగా.. కోహ్లీ అన్ని మ్యాచుల్లోనూ అదరగొడుతున్నాడు. మరోసారి తాను పరుగుల మిషన్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.

కాగా.... సంక్రాంతి పండగ మాత్రం కోహ్లీకి బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీకి జనవరి 15వ తేదీన ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అదరకొట్టాడు. మామలూగా అదరగొట్టడం కూడా కాదు. సెంచరీ పక్కా. ఇది చాలాసార్లు ప్రూవ్ కావడం గమనార్హం.

15 జనవరి 2017లో పూణెలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. కోహ్లీకి అది 27వ సెంచరీ.

ఆ తర్వాతి ఏడాది అంటే 2018లో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మూడో రోజు కోహ్లీ 153 పరుగులు చేశాడు. ఆ ఏడాది కోహ్లీ చేసిన తొలి సెంచరీ అదే కాగా, అది కూడా జనవరి 15నే కావడం విశేషం. 

ఆ తర్వాత 2019లో జనవరి 15నే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ వచ్చి చేరింది. ఈసారి కోహ్లీ ఆస్ట్రేలియాపై ఆ ఘనత సాధించాడు. అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 104 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా, ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగులతో చెలరేగాడు. అది కూడా సంక్రాంతి పండగ, జనవరి 15వ తేదీనే కావడం విశేషం. ఈ లెక్కన.. జనవరి 15 న కోహ్లీ ఏ మ్యాచ్ ఆడినా.. సెంచరీ చేయడం ఖాయం అన్నట్లుగా నిరూపించుకుంటున్నాడు.