టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ లోకేశ్ రాహుల్ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. ఏ స్థానంలో పంపినా తన సత్తా చూపిస్తూ సాగుతున్న రాహుల్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి టీ20ల్లో పదో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రాహుల్... హిట్‌మ్యాన్ ఔటైనా ఏమాత్రం జోరు తగ్గించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు.

Also Read:ఆ ఘనత టీమిండియాదే: టీ20 చరిత్రలో ఇదే తొలిసారి

స్వదేశంలో ఎలాంటి షాట్లు ఆడాడో.. విదేశీ గడ్డపైనా అదే జోరు చూపించి ఎక్కడైనా తన బ్యాటింగ్ ఇంతేనని చూపించాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో కివీస్ టాప్ పేసర్ టీమ్ సౌథీ బౌలింగ్‌లో కొట్టిన షాట్ హైలెట్‌గా నిలిచింది.

సౌధీ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా గ్యాలరీల్లోకి తరలించిన విధానం.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ట్రేడ్‌మార్క్ హెలికాఫ్టర్ షాట్‌తో పోలుస్తున్నారు విశ్లేషకులు. స్పిన్నర్ సోదీ బౌలింగ్‌లో ఔటవ్వడానికి ముందు రాహుల్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 27 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు.

Aముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోలిన్ మున్రో 59, రాస్ టేలర్ 54, కేన్ విలియమ్సన్ 51 పరుగులతో రాణించారు.