టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. సరదాగా కాఫీ తాగుతూ ఓ ఫోటో షేర్ చేయగా... రాహుల్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పాత సంఘటనలు గుర్తు చేస్తూ మరీ ట్రోల్ చేస్తున్నారు. 

 2019 జనవరిలో చిత్రనిర్మాత కరణ్ జోహార్ యొక్క టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో జరిగిన సంఘటనను అభిమానులు గుర్తుచేసుకున్నారు. ''ఈ కాఫీ కంటే ఆ కాఫీ చాల విలువైనది, మళ్ళీ కరణ్ ను పిలువమంటారా'' అంటూ సెటైర్లు వేశారు. 

 

కాఫీ విత్ కరణ్ టాక్ షోక్‌కి హాజరైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా.. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. కేఎల్ రాహుల్ తన జేబులో కండోమ్ ప్యాకెట్లు ఉంచుకునేవాడినని అసభ్యకరంగా మాట్లాడుతూ తన తండ్రికి ఓసారి దొరికిపోగా.. ఫర్వాలేదు సేప్టీ వాడుతున్నావని కితాబిచ్చినట్లు ఆ షోలో వెల్లడించాడు. 

యువతకి స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా నోరుజారడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా.. రాహుల్, హార్దిక్‌పై అప్పట్లో బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించింది. టాక్ షోలో వ్యాఖ్యలపై దుమారం రేగడంతో రాహుల్, హార్దిక్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అనంతరం వారిపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేయగా.. గత ఏడాది నుంచి ఇద్దరూ టీమ్‌లో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు. అయితే.. ఇప్పటికీ.. నెటిజన్లు.. అప్పటి విషయాలు గుర్తుచేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక కేఎల్ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే ఫోటో అప్‌లోడ్ చేసాడు, అక్కడ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనిని ట్రోల్ చేసాడు.  "కప్ మురికిగా ఉంది" అని కోహ్లీ రాహుల్ ఫొటోకు కామెంట్  జత చేసాడు. ఏదేమైనా, కెఎల్ రాహుల్ ఇటీవల మాట్లాడుతూ... ఆ సమయంలో అతని సస్పెన్షన్ తనకు స్థిరమైన ప్రదర్శనలను ఇవ్వడంలో మరియు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది అని తెలిపాడు.