మరోసారి నిరాశపరిచిన అజింకా రహానే... ఓవర్‌నైట్‌కి స్కోరుకి 2 పరుగులు జోడించి అవుటైన కెఎల్ రాహుల్... ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టు..

లార్డ్స్ టెస్టులో రెండో రోజు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అజేయ సెంచరీతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కెఎల్ రాహుల్, మొదటి బంతికే రెండు పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నట్టే కనిపించాడు. అయితే ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో సిబ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్...

రాహుల్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు. అండర్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానే. 23 బంతులాడిన రహానే కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరడంతో 282 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.