జర్మనీలో శస్త్ర చికిత్స తర్వాత ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న కెఎల్ రాహుల్... భారత మెన్స్ బ్యాటర్‌కి నెట్స్‌లో బౌలింగ్ చేసిన వుమెన్స్ సీనియర్ బౌలర్...
స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు గాయం కారణంగా జట్టుకి దూరమైన భారత క్రికెటర్ కెఎల్ రాహుల్... త్వరలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జర్మనీకి వెళ్లి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్... స్వదేశానికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి శిక్షణ తీసుకుంటున్నాడు...
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ సిరీస్‌కి రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మాత్రమే కాకుండా ఆ తర్వాత జరిగిన ఐర్లాండ్ సిరీస్‌తో, ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు, టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు కెఎల్ రాహుల్...
స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న కెఎల్ రాహుల్, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్టు నిరూపించుకుంటేనే విండీస్‌తో టీ20 సిరీస్ ఆడతాడు. కెఎల్ రాహుల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్‌నిస్ నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడని స్పష్టం చేసింది బీసీసీఐ.
ఆగస్టులో జరిగే ఆసియా కప్ 2022 సమయానికి జట్టుకి అందుబాటులో ఉంటాడని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు. రీఎంట్రీ ఇచ్చేందుకు ఎన్‌సీఏలో ప్రాక్టీస్ మొదలెట్టేశాడు కెఎల్ రాహుల్. కెఎల్ రాహుల్‌కి నెట్స్‌లో భారత సీనియర్ వుమెన్స్ బౌలర్ జులన్ గోస్వామి బౌలింగ్ చేయడం విశేషం...
జులన్ గోస్వామి కూడా కొంత కాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూ జట్టుకి దూరంగా ఉంటోంది. రీఎంట్రీ కోసం ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న జులన్ గోస్వామి... నెట్స్‌లో భారత బ్యాటర్ కెఎల్ రాహుల్‌కి బౌలింగ్ చేసింది...
కెఎల్ రాహుల్‌కి జులన్ గోస్వామి బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత సీనియర్ వుమెన్స్ బౌలర్ జులన్ గోస్వామి బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కాస్త ఇబ్బందిపడినట్టే కనిబడింది...
39 ఏళ్ల భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి... 202 వన్డేలు ఆడి 252 వికెట్లు పడగొట్టింది. వుమెన్స్ వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జులన్ గోస్వామి, 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టింది...
2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జులన్ గోస్వామి, 2022 వుమెన్స్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తుందని వార్తలు వినిపించినా, ఇంకా క్రికెట్‌లో కొనసాగాలనే పట్టుదలతో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది...
