కరీబియన్ దీవుల్లో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. వెస్టిండిస్ జట్టుపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటికే కోహ్లీసేన టీ20, వన్డే సీరిస్ లను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా టెస్ట్ సీరిస్ లో కూడా అదే ఫలితాన్ని రాబట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇలా ఆటను ఆస్వాదిస్తూనే కరీబియన్ అందాలను కూడా ఆస్వాదించేందుకు ఆటగాళ్లు సిద్దమయ్యారు. ముఖ్యంగా మొదటి టెస్ట్ జరిగిన ఆంటిగ్వా మంచి టూరిస్ట్ ప్లేస్ కావడంతో భారత ఆటగాళ్లు విరామ సమయంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో ముందుంటాడు. అతడు విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారీ తన భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మను కూడా వెంటబెట్టుకుని పోతుంటాడు. ఇలా భర్తతో పాటే కరీబియన్ దీవులకు అనుష్క చేరుకుంది. ఈ సందర్భంగా విరుష్క జంట బీచుల్లో షికారుచేస్తున్న ఫోటోలు కొన్ని ఇదివరకే  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బికినీలో అనుష్క శర్మ అందాలను ఆరబోస్తున్న ఫోటో తెగ చక్కర్లు కొట్టింది. 

తాజాగా విరుష్క జంట టీమిండియా ఆటగాళ్లతో కలిసి సముద్ర అందాలను తిలకించేందుకు వెళ్లారు.  కోహ్లీ-అనుష్క జంటతో పాటు యువ క్రికెటర్లు కెఎల్ రాహుల్,  మయాంక్ అగర్వాల్, సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ లు సముద్రంలో విహరించారు. వీరంతాకలిసి  బోట్ లో చక్కర్లుకొట్టారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను, తీసిన విడియోను కెఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. 

ఈ వీడియో, ఫోటోలు క్రికెట్ ప్రియులకు అమితంగా ఆకట్టుకున్నాయి. తాము ఇష్టపడే ఆటగాళ్లు, హీరోయిన్ కి సంబంధించిన ఈ వీడియో, ఫోటోలను వారు  తెగ షేర్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Endless blues 🌊💙

A post shared by KL Rahul👑 (@rahulkl) on Aug 26, 2019 at 4:29pm PDT