Asianet News TeluguAsianet News Telugu

KKRvsRR: గెలిచి, నిలిచిన కోల్‌కత్తా.... ప్లేఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ అవుట్...

35 పరుగులు చేసిన బట్లర్... 31 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా...

4 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్... వరుణ్ చక్రవర్తికి రెండు వికెట్లు...

60 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించిన రాజస్థాన్ రాయల్స్...

KKR vs RR: Rajasthan Royals goes out of IPL 2020 season Play-off Race CRA
Author
India, First Published Nov 1, 2020, 11:16 PM IST

IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్ రేసు నిష్కమించింది రాజస్థాన్ రాయల్స్. 192 పరుగుల భారీ లక్ష్యచేధనతో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్... 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. మొదటి బంతికి రాబిన్ ఊతప్ప సిక్సర్ బాదడం, బెన్‌స్టోక్స్ వరుస బౌండరీలు కొట్టడంతో 5 బంతుల్లోనే 19 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. 6 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, 11 బంతుల్లో 18 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 4, సంజూ శాంసన్ 1 పరుగు చేయగా రియాన్ పరాగ్ డకౌట్ అయ్యాడు. 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది రాజస్థాన్ రాయల్స్.  

ఈ దశలో రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్ కలిసి ఆరో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్లతో 35 పరుగులు చేసిన బట్లర్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. ఆర్చర్ 6, కార్తీక్ త్యాగి 2 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా 27 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 31 పరుగులు, శ్రేయాస్ గోపాల్ 22 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి ఓటమి తేడాను తగ్గించగలిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios