Asianet News TeluguAsianet News Telugu

KKRvsRR: మోర్గాన్ సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

మెరుపులు మెరిపించిన ఇయాన్ మోర్గాన్...

 

KKR vs RR: morgan captain innings helped kkr to score big total agianst RR CRA
Author
India, First Published Nov 1, 2020, 9:13 PM IST

IPL 2020: ప్లేఆఫ్ రేసును నిర్ణయించే కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా డకౌట్ కాగా శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి కలిసి రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

శుబ్‌మన్ గిల్ 24 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు, రాహుల్ త్రిపాఠి 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ కాగా... దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్ ఇద్దరూ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు.
గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన ఆండ్రే రస్సెల్ 11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుట్ కాగా...ప్యాట్ కమ్మిన్స్ 15 పరుగులు చేశాడు.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు తీయగా కార్తీక్ త్యాగి రెండు, శ్రేయాస్ గోపాల్, ఆర్చర్ చెరో వికెట్ తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios