11:45 PM (IST) Sep 23

ఆ ఇద్దరి తర్వాత కమ్మిన్స్...

బుమ్రా ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన ప్లేయర్లు ముగ్గురే... వాళ్లు ఎవ్వరంటే... 
JP Duminy Delhi 2015
Dwayne Bravo Mumbai WS 2018
Pat Cummins Abu Dhabi 2020 *

11:44 PM (IST) Sep 23

ముంబై రికార్డు విజయం...

Most wins against an opponent in IPL
20 MI vs KKR *
17 KKR vs KXIP
17 MI vs CSK

16 MI vs RCB

15 CSK vs DC

15 CSK vs RCB

11:43 PM (IST) Sep 23

ఏడేళ్ల తర్వాత ‘తొలి’ పరాజయం...

2013 నుంచి ఏడేళ్లుగా టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ గెలుస్తూ వస్తున్న కోల్‌కత్తా... 2020లో మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడి, రికార్డుకి బ్రేక్ వేసింది.

11:41 PM (IST) Sep 23

వారి కంటే కమ్మిన్స్ బెటర్...

Narine + Russell + Morgan = 36 runs off 41 balls, 2 sixes
Cummins - 33 runs, 12 balls, 4 sixes

11:40 PM (IST) Sep 23

ఆఖరి బంతికి వికెట్..

ఆఖరి బంతికి వికెట్ పడడంతో కోల్‌కత్తా 49 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

11:38 PM (IST) Sep 23

ఆఖరి బంతికి 50..

ఆఖరి బంతికి 50 పరుగులు కావాలి.

11:38 PM (IST) Sep 23

2 బంతుల్లో 52...

కోల్‌కత్తా విజయానికి 2 బంతుల్లో 52 పరుగులు కావాలి.

11:37 PM (IST) Sep 23

5 బంతుల్లో 54...

కోల్‌కత్తా పరాజయం ఖరారైంది. చివరి 5 బంతుల్లో 54 పరుగులు కావాలి.

11:32 PM (IST) Sep 23

బుమ్రా ఓవర్‌లో 27 పరుగులు...

మొదటి 3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రాను ఓ ఆటాడేసుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్. నాలుగు సిక్సర్లతో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు.

11:31 PM (IST) Sep 23

ప్యాట్ కమ్మిన్స్ 4 సిక్సర్లు...

బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదాడు ప్యాట్ కమ్మిన్స్...

11:30 PM (IST) Sep 23

కమ్మిన్స్ మూడో సిక్సర్...

ప్యాట్ కమ్మిన్స్, బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు.

11:28 PM (IST) Sep 23

ప్యాట్ కమ్మిన్స్ సిక్సర్లు...

రూ. 15 కోట్ల ఆటగాడు ప్యాట్ కమ్మిన్ బుమ్రా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

11:23 PM (IST) Sep 23

ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

నాయక్ అవుట్... 103 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

11:20 PM (IST) Sep 23

మోర్గాన్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

మోర్గాన్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

11:14 PM (IST) Sep 23

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... 11 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటైన రస్సెల్. 

11:11 PM (IST) Sep 23

రస్సెల్ షో మొదలైందా...

15వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు ఆండ్రూ రస్సెల్. 14.5 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని అందుకుంది కోల్‌కత్తా. 

11:07 PM (IST) Sep 23

6 ఓవర్లలో 106 పరుగులు...

కోల్‌కత్తా విజయానికి చివరి 36 బంతుల్లో 106 పరుగులు కావాలి. 

11:06 PM (IST) Sep 23

ఎట్టకేలకు ఓ సిక్సర్...

దినేశ్ కార్తీక్ అవుటైన తర్వాత ఎట్టకేలకు ఇయార్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 14 ఓవర్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 

11:01 PM (IST) Sep 23

వికెట్లకి తగిలినా పడని బెయిల్...

బుమ్రా బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ ఆడిన బంతి... వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ కదలకపోవడంతో మోర్గాన్ బతికిపోయాడు.

10:59 PM (IST) Sep 23

ముంబై టైట్ బౌలింగ్...

కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వని ముంబై బౌలర్లు... ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్ వంటి భీకర బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు కోల్‌కత్తా కష్టపడుతోంది.