కోల్‌కత నైట్‌రైడర్స్ తొలిసారి చిన్న బౌండరీల షార్జాకు వస్తోంది. 200 పైచిలుకు పరుగుల వేదికగా మారిన షార్జాలో అండ్రీ రసెల్‌ను ఆపటం బౌలర్లకు కష్టసాధ్యమే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు సీజన్‌లో తొలిసారి ముఖాముఖికి సిద్ధమయ్యాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో పరుగుల సాధన అంత సులువు కాదు. ఒక్కో పరుగూ స్కోరు బోర్డుకు జోడిస్తే గానీ.. జట్టు గౌరవప్రద స్కోరు చేయటం కుదరటం లేదు. అయినా, ఆఖరు ఓవర్లలో అన్ని జట్లూ దండిగా పరుగులు చేస్తున్నాయి.
మందకోడి పిచ్‌లపైనా పరుగుల వరద పారిస్తున్నాయి. అయినా, ఈ ఐపీఎల్‌లో ఇంకా కొన్ని లోటుపాట్లు అలాగే ఉన్నాయి. ఐపీఎల్ విధ్వంసకారుడు అండ్రీ రసెల్ బ్యాటింగ్ విన్యాసాలు ఇంకా అభిమానులు చూడలేదు.
కోల్‌కత నైట్‌రైడర్స్ తొలిసారి చిన్న బౌండరీల షార్జాకు వస్తోంది. 200 పైచిలుకు పరుగుల వేదికగా మారిన షార్జాలో అండ్రీ రసెల్‌ను ఆపటం బౌలర్లకు కష్టసాధ్యమే. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు సీజన్‌లో తొలిసారి ముఖాముఖికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.
రసెల్‌పైనే చూపులన్నీ..:
కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఒంటిచేత్తో విజయాలు అందించిన స్టార్ అండ్రీ రసెల్ ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడనేలేదు. చిన్న బౌండరీల షార్జాలో అతడు చెలరేగాలని కోల్‌కత, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫామ్‌లో ఉన్న ఇయాన్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్ సైతం ఇక్కడ భారీ స్కొర్లపై కన్నేశారు. కోల్‌కత చివరి మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శనతో గెలుపొందింది. కోల్‌కత దన్నుగా నిలిచి నిలుపుకున్న యువ బౌలర్ల శివం మావి, కమలేశ్ నాగర్‌కోటిలు కళ్లుచెదిరే ప్రదర్శన చేశారు.
పాట్ కమిన్స్ తోడుగా చెలరేగారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. షార్జాలోనైనా కుల్దీప్ యాదవ్ లయ అందుకుంటాడేమో చూడాలి.
కుర్రాళ్లు చెలరేగుతారా?
కోల్‌కత వైపు రసెల్ ఉండగా.. ఢిల్లీకి రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ సైతం తొలి మూడు మ్యాచుల్లో రాణించలేదు. అనుకూలమైన షార్జాలో అతడు రాణిస్తే ఢిల్లీకి కొండంత అండ. యువ ఓపెనర్ పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు ధనాధన్ తడాకా చూపించాలి.
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నేడు బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపిస్తే మిడిల్ ఆర్డర్‌లో కుర్రాళ్లు మరింత స్వేచ్ఛగా పరుగులు వేటలో చెలరేగేందుకు వీలు చిక్కుతుంది. ఆ బాధ్యతను సీనియర్‌గా ధావన్ తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడు. విండీస్ కుర్రాడు షిమ్రోన్ హెట్మయర్, మార్కస్ స్టోయినిస్‌లూ చిన్న బౌండరీల గ్రౌండ్‌లో సిక్సర్ల షోకు రెఢీ అవుతున్నారు. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, అమిత్ మిశ్రా కీలకం కానున్నారు.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాష్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జ్టె, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.
కోల్‌కత నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, కమలేశ్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, శివం మవి, వరున్ చక్రవర్తి.
