వరుస ఓటముల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ మొహాలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ద్వారా మళ్లీ విజయాల బాటలో పడింది. వారి సొంత మైదానంలోనే కింగ్స్ లెవెన్ పంజాబ్ ను చిత్తుగా ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే చేధించింది. ఇలా కెకెఆర్ ఘన విజయాన్ని సాధించినా తనకు సంతృప్తిని ఇవ్వడంలేదంటూ కెప్టెన్ దినేశ్ కార్తిక్ మ్యాచ్ అనంతరం సంచలన  వ్యాఖ్యలు చేశాడు.  

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 183 పరుగుల భారీ స్కోరును సాధించింది. నికోలస్ పూరన్ (48 పరుగులు 27 బంతుల్లో), సామ్ కుర్రన్ (55 పరుగులు 24 బంతుల్లో) రాణించడంతో ఈ భారీ స్కోరు సమోదయ్యింది. ఇలా కోల్‌కతా బౌలర్లు వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. అలాగే ఫీల్డింగ్ లోనూ అనేక తప్పులు చేస్తూ మంచి అవకాశాలను మిస్ చేశారు. ఈ రెండు విబాగాలే కార్తిక్ అసంతృప్తికి కారణమయ్యాయి. 

బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనే తమ జట్టు ఇంకా చాలా మెరుగుపడాల్సి వుందని కార్తిక్ అన్నాడు. వీటిలో విఫలమవవడం వల్లే వరుసగా ఓటములను చవిచూడాల్సి వచ్చిందన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో తమ జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదన్నాడు. ఒక కెప్టెన్ ఈ రెండు విషయాలే తనను అసంతృప్తికి గురిచేస్తున్నాయని కార్తిక్ అన్నాడు. 

వ్యక్తిగతంగా ఎవరి ప్రదర్శన ఎలా వుందో తాను చెప్పనని...కానీ ప్రతి ఆటగాడు తమ ఆటతీరుపై ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నాడు. వాళ్ల తప్పులను తెలుసుకుని వాటిని అదిగమిస్తే మంచిదని హెచ్చరించాడు. లేదంటే చాలా తక్కువ మందికి తెలిసిన తన కోపం ఎలా వుంటుందో మరాకొంత మందికి తెలియజేయాల్సి వుంటుందని జట్టు సభ్యులకు సున్నితంగా హెచ్చరించాడు. 

బ్యాటింగ్ విషయానికి వస్తే తమ జట్టు ముందునుండి బలంగానే వుందని...అదొక్కటి తమ జట్టుకు సానుకూలాంశమని తెలిపాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టి వేగంగా పరుగులు రాబట్టడంలో ప్రతిసారి కెకెఆర్ బ్యాట్ మెన్స్ సపలమవుతున్నారని ప్రశసించాడు. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ అద్భుతంగా ఆడాడని... అతడిపై నమ్మకంతోనే టాప్ ఆర్డర్లో అవకాశమిచ్చామన్నాడు. ఈ అవకాశాన్ని గిల్ సద్వినియోగం చేసుకున్నాడని కార్తిక్ అన్నాడు.