ఐపీఎల్ 2019లో పంజాబ్ మరో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠంగా సాగిన పోరులో కింగ్స్ ఎలెవన్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఐపీఎల్ 2019లో పంజాబ్ మరో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠంగా సాగిన పోరులో కింగ్స్ ఎలెవన్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

డేవిడ్ మిల్లర్ 30, సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీకి తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా వికెట్ కోల్పోయింది. అయితే ధావన్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వీరు కూడా స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్, ఇంగ్రామ్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడటంతో 24 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 7 వికెట్లు ఉండటంతో ప్రతి ఒక్కరు ఢిల్లీ గెలుపు ఖాయమనుకున్నారు.

అయితే పంత్, మోరిస్‌లను షమీ ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఆ తర్వాత సామ్ కరన్ తన మాయాజాలంతో ఇంగ్రామ్, హర్షల్ పటేల్‌‌ను ఔట్ చేశాడు. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో హనుమ విహారి క్లీన్ బౌల్డ్ కావడంతో ఢిల్లీ ఓటమి దాదాపు ఖరారైంది.

18వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్‌ను ఔట్ చేసిన కరన్.. 20వ ఓవర్ తొలి రెండు బంతులకు రబాడ, లమిచానెలను క్లీన్‌బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఢిల్లీ 19.2 ఓవర్లలో 152 పరుగులకు అలౌటైంది.