ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్...యువరాజ్ సింగ్, హర్షల్ గిబ్స్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డు...

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్ రికార్డును వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ సమం చేశాడు. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌‌‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విండీస్ కెప్టెన్, మ్యాచ్‌ను మలుపు తిప్పి పెవిలియన్ చేరాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. వికెట్ కీపర్ డిక్‌వాలా 33, ప్రతుమ్ నిశాకా 39 పరుగులతో రాణించారు. 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్, 62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

5 ఓవర్లు ముగిసేసరికి సిమన్స్, లూయిస్, క్రిస్‌గేల్, పూరన్ పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్‌లో ధనంజయ ఓవర్‌లో సిక్సర్ల మోత మొదలెట్టిన పోలార్డ్, ఆరు బంతులను బౌండరీ అవతల పడేశాడు. 11 బంతుల్లో 6 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పోలార్డ్, ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుటైనా, జాసన్ హోల్టర్ విండీస్‌కి విజయాన్ని అందించాడు.

Scroll to load tweet…

2007లో యువరాజ్ సింగ్, 2017లో హెర్షెల్ గిబ్స్‌ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్లుగా నిలిచారు.