ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్‌, మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఆల్‌రౌండర్‌, మాజీ స్పిన్నర్‌, మాజీ పేసర్‌కు చోటిచ్చాడు. మరి.. కీరన్‌ పొలార్డ్‌ ఫేవరెట్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్స్‌ ఎవరంటే..

T20 world cup త్వరలో ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ కోసం అన్ని దేశాల క్రికెటర్లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ పొట్టి ఫార్మాట్‌లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్‌, మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఆల్‌రౌండర్‌, మాజీ స్పిన్నర్‌, మాజీ పేసర్‌కు చోటిచ్చాడు. మరి.. కీరన్‌ పొలార్డ్‌ ఫేవరెట్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్స్‌ ఎవరంటే..

క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌), లసిత్‌ మలింగ(శ్రీలంక), సునిల్‌ నరైన్‌(వెస్టిండీస్‌), ఎంఎస్‌ ధోని(ఇండియా), కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌). అవును.. తనకు ఇష్టమైన జాబితాలో ముగ్గురూ విండీస్‌ ఆటగాళ్లు.. ముఖ్యంగా అందులో తన పేరును కూడా పొలార్డ్‌ పేర్కొనడం విశేషం.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. విండీస్ కూడా టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించింది. కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్.