ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఐపీఎల్ ని రద్దు చేశారు. ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. 

అంతకముందు  కోల్ కతా ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగానే కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది.  ఆ తర్వాత చెన్నై కోచ్ లక్ష్మీ పతి బాలాజీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రతి టీంలోనూ వైరస్ బాధితులు పెరుగుతుండటంతో... ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

ఐపీఎల్ రద్దు కావడంతో క్రికెటర్లంతా ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చేసిన ఓ ట్వీట్.. మీమర్స్ పండగలా మారింది. ఆయన ట్వీట్ తో మీమ్స్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో.. రియాన్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకీ రియాన్ చేసిన ట్వీట్ ఏంటంటే...‘ ఖతమ్, టాటా, బై బై, ’ అని ట్వీట్ చేసి ఐపీఎల్ ని కూడా ట్యాగ్ చేశాడు.. అంతేకాకుండా ఐపీఎల్ క్యాన్సిల్ అనే ట్యాగ్ కూడా చేశాడు. కాగా.. దానిని మీమర్స్ ట్రోల్ చేయడం విశేషం. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. బాలీవుడ్ సినిమాల్లోని ఫోటోలతో ట్రోల్ చేశారు. ఈ సీజన్ రద్దు అయినందుకు రాజస్టాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైజర్స్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారనే అర్థం వచ్చేలా మీమ్స్ చేయడం విశేషం. ఎందుకంటే ఈ సీజన్ లో చెత్తగా ఫర్మామ్ చేసింది ఈ మూడు జట్లే కావడం గమనార్హం. కొందరేమో పరాగ్ డ్యాన్స్ మిస్ అయ్యామంటూ కామెంట్స్ పెట్టడం విశేషం.