ఈ క్రమంలో.. ఆయన తన పాన్ కార్డు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం. కాగా.. ఈ విషయంలో భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. 

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్.. క్రికెట్ ప్రియులకు పరిచయమే. ఆయన ఆటకు భారత్ లోనూ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఐపీఎల్ వేలంలో భాగంగా.. ఆయన ఇటీవల ఇండియా వచ్చాడు. అయితే.. ఈ క్రమంలో.. ఆయన తన పాన్ కార్డు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం. కాగా.. ఈ విషయంలో భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు.

Scroll to load tweet…

''నా పాన్‌కార్డ్‌ ఎక్కడో పోయింది. ప్లీజ్‌ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా పీటర్సన్‌ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్‌ కెవిన్‌ పీటర్సన్‌.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్‌ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్‌సైట్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్‌కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్‌ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్​ కృతజ్ఞతలు తెలిపాడు.