ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  కాగా..  ఈ సిరీస్ గెలిచిన ఆనందంలో టీమిండియా ఉంది. అయితే.. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో మరో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్.. భారత్ లోనే జరగనుంది.

ఈ నేపథ్యంలో.. టీమిండియాకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ హెచ్చరించాడు. ఆసీస్ తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత  వారిని అభినందించిన పీటర్సన్... ఆసీస్ పర్యటన కాదు వచ్చే నెలలో హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ భారత జట్టుకు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.

 కాబట్టి ఆతిథ్య జట్టు జాగ్రత్తగా ఉండాలని తెలిపిన పీటర్సన్.. ఆసీస్ పై విజయానికి ఎక్కువగా సంబరాలు జరుపుకోకండి... ఇంగ్లాండ్ తో టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్, ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ కు చేరుకుంది. ఈ పర్యటనలో వారు భారత జట్టుతో 4 టెస్ట్, 3-వన్డే మరియు 5 టీ 20ల సిరీస్ లను  ఆడనున్నారు.