Asianet News TeluguAsianet News Telugu

కథ ఇంకా అయిపోలేదు... మూడేళ్ల తర్వాత డబుల్ సెంచరీతో రీఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్...

మూడేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన టీమిండియా క్రికెటర్.. 

Kedar Jadhav scored 283  in his comeback First-Class match after 3 years, Ranji Trophy
Author
First Published Jan 5, 2023, 3:40 PM IST

కేదార్ జాదవ్... మహేంద్ర సింగ్ ధోనీ హయాంలో టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న ఆల్‌రౌండర్. పేరుకి ఆల్‌రౌండర్ అయినా 9 టీ20 మ్యాచులు ఆడినా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం విశేషం. దాదాపు 38 ఏళ్లకు చేరువైన కేదార్ జాదవ్, చివరిసారిగా 2020లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు...

రెండు సీజన్లుగా కేదార్ జాదవ్‌, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కేదార్ జాదవ్‌ని కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లోనూ జాదవ్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాకపోవడంతో మెగా వేలానికి విడుదల చేసింది... 

2022 మెగా వేలంలో అమ్ముడుపోని కేదార్ జాదవ్, ఐపీఎల్ 2023 మినీ వేలంలో షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఆప్తులు సురేష్ రైనా, మురళీ విజయ్ మాదిరిగానే కేదార్ జాదవ్ కెరీర్ కూడా మధ్యలోనే ముగిసినట్టే అనుకున్నారంతా. అయితే అన్యూహ్యంగా మూడేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి డబుల్ సెంచరీతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు కేదార్ జాదవ్...

అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరుపున బరిలో దిగిన కేదార్ జాదవ్ 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్లతో 283 పరుగులు చేశాడు. సరిగ్గా 100 స్ట్రైయిక్ రేటు మెయింటైన్ చేసిన కేదార్ జాదవ్, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 15వ సెంచరీ నమోదు చేశాడు... కేదార్ జాదవ్ 79 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 15 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 5154 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఒక్క వికెట్ తీయడం మరో విశేషం. 

లిస్టు ఏ క్రికెట్‌లో 155 మ్యాచులు ఆడి 30 వికెట్లు తీసిన కేదార్ జాదవ్, టీమిండియా తరుపున వన్డేల్లో 27 వికెట్లు తీశాడు. కేదార్ జాదవ్ ఇన్నింగ్స్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 147 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 594 పరుగులు చేసింది. సిద్ధేశ్ వీర్ 106 పరుగులు చేయగా నైషద్ షేక్ 47 పరుగులు చేశాడు. అస్సాం బౌలర్ రియాన్ పరాగ్ 4 వికెట్లు తీశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 274 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పుర్కయస్త 65 పరుగులు చేయగా ఆకాశ్ సేన్‌గుప్తా 65 పరుగులు చేశాడు. మహారాష్ట్రకి తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది...

మరో మ్యాచ్‌లో మిజోరాంపై మణిపూర్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించగా జమ్ము కశ్మీర్‌పై రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో గెలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios