Asianet News TeluguAsianet News Telugu

ధోని బర్త్ డే: కరోనా కి మందు నువ్వే అంటూ కేదార్ జాదవ్ ఎమోషనల్

టీం ఇండియా క్రికెటర్ కేడర్ జాదవ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తన గుండె లోతుల్లోంచి తన భావాలన్నీ రంగరించి లేఖ రాసాడు. 

Kedar Jadhav's Emotional Letter to Dhoni On His Birthday
Author
Mumbai, First Published Jul 7, 2020, 6:53 PM IST

నేడు ధోని బర్త్ డే. అందరూ ధోనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. టీం ఇండియా క్రికెటర్ కేడర్ జాదవ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తన గుండె లోతుల్లోంచి తన భావాలన్నీ రంగరించి లేఖ రాసాడు. 

డియర్ మహి భాయ్,

నేను లైట్ హౌజ్ ని చూసిన ప్రతీ సారి, ఆ లైట్ హౌజ్ నాకు నిన్నే గుర్తు చేస్తోంది. లైట్ హౌజ్ దారిని చూపిస్తుంది, ప్రయాణించే శక్తిని, నమ్మకాన్ని ఇస్తుంది, దిక్సూచిగా మార్గాన్ని నిర్దేశిస్తుంది, అచ్చం నీలాగే. నువ్వు నాలాంటి ఎంతో మందిని సరైన దారిలో నడిపించావు, కష్టకాలంలో ఎదురయ్యే ఒడి దుడుకులను ఎలా అధిగమించి నాడవాలో నేర్పించడం మాత్రమే కాకుండా  నువ్వు తోడుగా ఉన్నవనే భరోసాను ఇచ్చావు. ఎప్పటికీ అలాగే ఉంటాను అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మా వెనుక బలంగా నిలబడ్డావు, అచ్చం ఆ లైట్ హౌజ్ లాగే!

గత కొన్ని సంవత్సరాలుగా మనం మన పుట్టినరోజు వేడుకలను కలిసి జరుపుకున్నాం. కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల మనం అసలు కలుసుకోలేకపోతున్నాం. ఈ లాక్ డౌన్లో జరిగిపోయిన క్రికెట్ మ్యాచులని చూస్తూ ఒక్కసారి నా క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాను. క్రికెట్ ఆడే సమయంలో మన పార్ట్నర్ షిప్, స్టంప్స్ వెనుక నుండి నువ్వు ఇచ్చే సలహాలు - సూచనలు, మైదానం బయట మన అనుబంధం, ఇలా అన్నీ గుర్తు చేసుకుంటే నా జీవితం ఎప్పుడూ పైకి మాత్రమే పరిగెడుతున్న రోలర్ కోస్టర్ రైడ్ లాగ అనిపించింది. నీ బర్త్ డే కి నీకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్న. కానీ రెండు వరల్డ్ కప్స్, ఛాంపియన్ ట్రోఫీ, టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానాన్ని మాకు బహుమతిగా ఇచ్చిన నీకు నేను ఎం ఇవ్వగలను? ఈ ప్రపంచంలో ఎంత పెద్ద వస్తువు అయిన నీ విలువలకి, గొప్పతనానికి సాటి రావు అని నేను అనుకుంటుండగా నాకు ఒక ఆలోచన తట్టింది. నాతో పాటుగా నీ ఫాన్స్ అందరి తరుఫున, మాకు నీ మీద ఉన్న గౌరవాన్ని, ప్రేమని వ్యక్తపరిచే విధంగా ఒక ఉత్తరాన్ని రాయడాన్ని మించిన మంచి గిఫ్ట్ ఏముంటుందని నాకు అనిపించింది.

మహి భాయ్, నేను నా జీవితాన్ని నిన్ను మొదటి సారి టీవీలో చూసినప్పటి క్షణం నుండి నీతో మైదానంలో ఆడే నిమిషం వరకు మొత్తం గుర్తుతెచ్చుకొలేక పోవచ్చు. కానీ న మనసులో మాత్రం ఒక సంఘటన అలా పదిలంగా నిలిచిపోయింది. అప్పుడు 2017లో మనం మ్యాచ్ తరువాత ప్రయానిస్తున్నాం. ఫ్లైట్ లో నాది నీ పక్క సీట్. బాగా అలసిపోయి ఉన్నందువల్ల నేను డిన్నర్ కూడా చేయకుండానే నిద్రలోకి జారిపోయాను. నాకు మెలకువ వచ్చి చూసేసరికి నా ఎదురుగా రెండు డిన్నర్ ప్లేట్లు చూసాను. రెండో డిన్నర్ ప్లేట్ ని చూపించి  'ఇది ఎవరిది?' అని అడిగాను. అందుకు నువ్వు 'ఈ ప్లేట్ నాదే. నువ్వు నిద్ర లేవడం మంచిది అయింది. నువ్వు లేచాక కలిసి తిందాం అని నీకోసమే వెయిట్  చేస్తున్నాను' అని నవ్వుతూ సమాధానం ఇచ్చావ్. అప్పటి వరకు ఎప్పుడూ నాకు ఒక అన్నయ్య ఉంటే బావుండేది కదా అని అనుకునే నేను ఆ క్షణంలో నీలో ఒక అన్నయ్య ని చూసుకున్నాను. నేటి వరకు ఈ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతీ సారి నాకు ఒక పాట గుర్తకొస్తుంది, 'మేరీ జిందగీ సవారీ...' ( హిందీ పాట).

ఇదే విధంగా నువ్వు దేశంలోని కోట్లాది ఫాన్స్ అందరికోసం ఒక స్నేహితుడిగా, గురువుగా, ఇన్స్పిరేషన్ గా, తలాగా( తలైవా) ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తున్నావు. నువ్వు స్టేడియం లో బ్లూ జెర్సీ వేసుకొని బరిలోకి దిగినప్పుడు మేము మా భావాలను ఎన్నో విధాలుగా వ్యక్తం చేసే అవకాశం మాకు ఉంటుంది కానీ నువ్వు ఇండియన్ ఆర్మీ యూనిఫాం వేసుకున్నప్పుడు మాత్రం మా కళ్ళు గర్వంతో మెరిసిపోతు నీ మీద ఉన్న గౌరవాన్ని వ్యక్తపరుస్తాయి.

నువ్వు ఒకసారి నాకు జీవిత మంత్రాన్ని నేర్పించావు. ' కేదార్! మనం ఎప్పుడూ ఆఖరి బంతి వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద టార్గెట్ అయినా అసాధ్యం కాదు. దేవుడి మీద నమ్మకం ఉంచి నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగించు. అది గ్రౌండ్ లో అయినా జీవితంలో అయినా'. ఆట ఓడిపోయిన తరువాత కూడా చెరగని నీ చిరునవ్వు నుండి గెలిచిన తరువాత ట్రోఫీ ని యువ ఆటగాళ్లకు ఇవ్వడం వరకు నువ్వు నీ జీవితం మొత్తం ఈ లైఫ్ మంత్ర ని ఆచరించావు. మాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పించావు కానీ అంత కంటే ఎక్కువగా ప్రతీ ప్లేయర్ పై ఎంతో నమ్మకం ఉంచి చాలా సపోర్ట్ చేశావు. అలా నువ్వు ఒక గొప్ప జట్టును తయారు చేశావు, అది చాలా గొప్ప విషయం.

2015 ప్రపంచ కప్ కోసం నీకు పుట్టబోయే బిడ్డని చూడకుండా ' నేను జాతీయ విధిలో ఉన్నాను, కనుక మిగతాది ఏది అయిన వేచి ఉండొచ్చు' అని బయలుదేరి వచ్చినపుడు నీలో ఒక అంకిత భావం కలిగిన కెప్టెన్ ని చూసాను. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తరువాత ట్రోఫీ తో ఫోటోలు దిగుతూ, జట్టుతో సంబరాల్లో మునిగి తేలడానికి బదులుగా , జీవ తో నువ్వు ఆడుకునే అప్పుడు నిన్ను బిడ్డను ఎంతో ప్రేమించే ఒక తండ్రిగా చూసాను. నువ్వు మాకు నేర్పించే పాఠాలలో క్రికెట్ ఒక పై పొర మాత్రమే, నిజానికి నువ్వు మాకు జీవితం అనే ఈ ఆటను ఎలా ఆడాలో నేర్పిస్తున్నావు.

గత కొన్ని నెలలుగా కరోనా వల్ల గానీ లేదా ఎంతో ప్రతిభావంతులైన నటుల మరణాల వల్ల దేశం లోని ప్రతీ ఒక్కరూ డిప్రెషన్ కి లోనవుతున్నారు. అంతా మళ్లీ బాగైపోతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కానీ ఈ లోపల దేశం లోని ప్రజలలో నెలకొన్న దిగులును అధిగమించేలా, ఆనందించేందుకు అనుకూలంగా ఏదైనా గొప్ప విషయం జరగాలి. ఆ విషయం ప్రజలను వారి కష్టాలని, దిగులుని మరచిపోయి, అనందపడేలా చేయాలి. నువ్వు మరొక్కసారి పిచ్ పై బరిలోకి దిగడం కంటే మాకు ఆనందించే విషయం మరేదైనా ఉంటుందా? ఇది జరిగితే తరువాత అన్ని అవే సర్దుకుంటాయి.

మహి భాయ్, గత పదిహేను ఏళ్ళగా నువ్వు ఆడడం చూశాము. కానీ మాకు అది ఇంకా సరిపోలేదు. దేశం అంతా, నాతో సహా నువ్వు మరొక్కసారి బంతిని బౌండరీలు దాటే లాగ బాదడం చూడాలని ఎదురుచూస్తుంది. నువ్వు క్రీజ్ లో నిలబడి ఉండడం నేను కళ్ళకి కట్టినట్టుగా చూడగల్గుతున్నాను. అప్పుడు ఫాన్స్ అందరూ ధోని... ధోని అని అరవడం, నువ్వు నీదైన శైలిలో మ్యాచ్ ముగించేసి ఎలాంటి ఆర్భాటం లేకుండా చిరునవ్వుతో పెవీలియన్ కి వెళ్ళడం.. అప్పుడు మేము అంతా బిజీగా మరొక్కసారి ఆనంద భాష్పాలు నిండిన మా కళ్ళతో ఆ దృశ్యాన్ని భధ్రపరుచుకుంటాం. ఆ క్షణం లో మా అందరి మనసుల్లో మాత్రం తప్పకుండా ఒక పాట మెదులుతుంది...          

              అభీ న జావో ఛోడ్ కర్...

              కే దిల్ అభీ భరా నహీ...

              కే దిల్ అభీ భరా నహీ...

నీ ఫ్రెండ్ & టీమ్మేట్

  కేదార్ జాదవ్.

Follow Us:
Download App:
  • android
  • ios