Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందే సన్‌రైజర్స్‌కి షాక్... కేన్ విలియంసన్‌కి గాయం...

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన కేన్ విలియంసన్...

కేన్ విలియంసన్ మోచేతికి గాయం... కోలుకోవడానికి సమయం పడుతుందన్న వైద్యులు...

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కి కేన్ దూరం... ఐపీఎల్ 2021 సీజన్‌పై అనుమానాలు...

Kane Williamson Injured, and rested for Bangladesh Series, doubts on IPL CRA
Author
India, First Published Mar 11, 2021, 12:09 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కి సొంత గ్రౌండ్‌లో హోస్ట్ ఇవ్వలేకపోయిన హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియంసన్, ఐపీఎల్ ఆరంభానికి ముందు గాయపడ్డాడు.

టెస్టుల్లో వరుస సెంచరీలతో టాప్ ర్యాంకుకు ఎగబాకిన కేన్ విలియంసన్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. కేన్ విలియంసన్ ఎడమ మోచేతికి గాయమైందని, అది తగ్గేందుకు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు.

దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో కేన్ విలియంసన్ పాల్గొనడం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉండడంతో ఆ సమయానికి కేన్ విలియంసన్ కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

ఒకవేళ కోలుకున్నా ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపయన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఉండడంతో కేన్ విలియంసన్ పూర్తి సీజన్‌ మొత్తం అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తేలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios