Asianet News TeluguAsianet News Telugu

T20 World cup: గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు.. కానీ..!

బంతిని అందుకున్నా తనని తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌పై పడిపోతుండటంతో.. ఆఖరి క్షణంలో బంతిని మైదానంలోకి విసిరాడు. అయితే.. బంతి అతని చేయి జారి.. బౌండరీ రోప్‌పై పడింది.

Jonny Bairstow's Failed Catch Attempt That Sparked New Zealand's Comeback In Semi-Final Against England
Author
hyderabad, First Published Nov 11, 2021, 10:52 AM IST

T20 worldcup లో అన్నిజట్లు  అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాయి. బుధవారం ఈ ప్రపంచకప్ లో భాగంగా .. న్యూజిలాండ్,  ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ లో.. ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది..  ఇంగ్లాండ్ బౌలర్ జానీ బెయిర్స్ట్రో అద్భుతమైన క్యాచ్ పట్టినా.. అది సిక్స్ గా మారింది. దీంతో.. ఇంగ్లాండ్ జట్టుకి తీవ్ర నిరాశ ఎదురైంది.

న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫస్ట్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద ఆశ్చర్యకరరీతిలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ జట్టులో మొయిన్ అలీ (51 నాటౌట్: 37 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. డేవిడ్ మలాన్ (41: 30 బంతుల్లో 4x4, 1x6) విలువైన పరుగులు చేశాడు. అనంతరం 167 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్ మిచెల్ (72 నాటౌట్: 47 బంతుల్లో 4x4, 4x6) దూకుడుగా ఆడటంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 167/5తో విజయాన్ని అందుకుంది. స్లాగ్ ఓవర్లలో నీషమ్ (27: 11 బంతుల్లో 1x4, 3x6) భీకర హిట్టింగ్.. మిచెల్ పనిని మరింత సులువు చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

వాస్తవానికి మ్యాచ్‌లో మిచెల్ వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్దే బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్రిస్ జోర్దాన్‌కి దొరికిపోయినట్లు కనిపించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్స్ కోసం బంతిని మిచెల్ హిట్ చేయగా.. లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ కోసం జోర్దాన్ గాల్లోకి ఎగిరాడు. బంతిని అందుకున్నా తనని తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌పై పడిపోతుండటంతో.. ఆఖరి క్షణంలో బంతిని మైదానంలోకి విసిరాడు. అయితే.. బంతి అతని చేయి జారి.. బౌండరీ రోప్‌పై పడింది. దాంతో.. రిప్లైని క్షుణ్నంగా పరిశీలించిన అంపైర్.. సిక్స్‌గా ప్రకటించాడు. క్యాచ్ మిస్ అయినా.. నాలుగు పరుగులు ఇంగ్లాండ్‌కి సేవ్ అయినట్లు మొదట కనిపించింది. కానీ.. చివరికి ఆ జట్టుకి నిరాశ తప్పలేదు.

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో క్రిస్ జోర్దాన్‌ బౌలింగ్‌లో అప్పటికే ఒక సిక్స్, ఫోర్ బాదిన నీషమ్.. మరో సిక్స్ కోసం ప్రయత్నించాడు. మిడ్ వికెట్ దిశగా అతను కొట్టిన బంతి సిక్స్‌గా వెళ్తుండగా.. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్ జానీ బెయిర్‌‌స్టో.. బంతిని డైవ్ చేస్తూ క్యాచ్‌గా అందుకుని అప్పటికే తన సమీపానికి వచ్చిన మరో ఫీల్డర్ లివింగ్‌స్టోన్‌కి విసిరాడు. దాంతో.. నీషమ్ ఔట్ అని అంతా అనుకున్నారు. కానీ.. రిప్లై జానీ బెయిర్‌స్టో బంతిని లివింగ్‌స్టోన్‌కి విసరక ముందే బౌండరీ లైన్‌కి తన మోకాలిని తాకించినట్లు తేలింది. దాంతో.. అంపైర్ సిక్స్‌గా సిగ్నల్ ఇచ్చాడు. మొత్తంగా.. క్రిస్ జోర్దాన్, జానీ బెయిర్‌స్టో.. బౌండరీ లైన్ వద్ద మెరుగైన ఫీల్డింగ్ చేసినా.. చిన్న తప్పిదం అంపైర్ సిక్స్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్.. టీ20 వరల్డ్‌కప్ 2021 నుంచి నిష్క్రమించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios